ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు... బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు
ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్‌సిటీ రైలుకు ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ నుంచి రైలు నాందేడ్‌కు వెళ్తుండగా ఇంజన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. క్షణాల్లోనే పొగలు భారీగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు.
బుధవారం(జూన్ 16) ఉదయం రైలు తలమడుగు మండలం డోర్లిగేడ్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగానే పొగలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు దాదాపు గంటకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. ఆదిలాబాద్ నుంచి మరో ఇంజిన్ వచ్చిన తర్వాత రైలు అక్కడినుంచి కదిలింది.

ఆదిలాబాద్-నాందేడ్ రైల్లో ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని రైల్వే సిబ్బంది చెబుతున్నారు.సాంకేతిక సమస్య తలెత్తిన రైలు ఇంజిన్‌ను రైల్వే టెక్నీషియన్స్ బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్-నాందేడ్ మధ్య నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా పాలు,కూరగాయల వ్యాపారులు ఇందులో ఎక్కువగా ప్రయాణిస్తారు.
గత నెలలో పెద్దపల్లి జిల్లా చీకురాయి వద్ద ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. ఆక్సిజన్ ట్యాంకర్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గూడ్స్ రైలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలోని చీకురాయి రైల్వే గేటు వద్దకు చేరుకోగానే ఆక్సిజన్ ట్యాంకర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గూడ్స్ రైలు సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఆపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సకాలంలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను త్వరగానే అదుపులోకి తీసుకొచ్చారు. ఎండ వేడిమి వల్ల లేదా బ్రేక్ వేసిన సమయంలో మంటలు మంటలు చెలరేగి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పిందని గూడ్స్ రైలు సిబ్బంది తెలిపారు.
Recommended Video
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications