వీడియో: షర్ట్‌లో దూరిన ఆరడుగుల నాగుపాము- గుండె జారి గల్లంతు

న్యూఢిల్లీ: పాములను చూస్తే అల్లంత దూరం పరుగెడుతుంటాం. వాటిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంటుంది. చాలావరకు పాములు విషపూరితమైనవి కాకపోయినా.. వాటిని చూస్తే పైప్రాణాలు పైనే పోతుంటాయి. దూరం నుంచి చూస్తేనే చెమటలు పట్టేస్తాయి. భారీ వర్షాలు కురుస్తోన్న సమయంలో ఎక్కడా లేని పాములన్నీ రోడ్ల మీదే కనిపిస్తుంటాయి.

ఓ ఆరడగులు నాగుపాము.. ఓ వ్యక్తి షర్ట్‌లో దూరింది. కొన్ని నిమిషాల పాటు అక్కడే తిష్ఠ వేసింది. బయటికి రావడానికీ ఇష్టపడలేనట్టుగా కనిపించిందా కింగ్ కోబ్రా. ఆ వ్యక్తికి కాటు వేయనివ్వకుండా, జాగ్రత్తగా దాన్ని బయటికి తీయడానికి స్నేక్ క్యాచర్స్‌కు తల ప్రాణం తోకలోకి వచ్చింది. ఆ వ్యక్తికి ఎలాంటి హాని కలగకుండా ఆ పామును బయటికి తీయగలిగారు.

Snake enters a mans shirt, video goes on viral

కొన్ని నిమిషాల పాటు తన ఒంటి మీద ఉన్న జరజరమంటూ పాకుతూ ఉన్న పాముతో ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విషపూరిత పాము ఓ వ్యక్తి చొక్కా లోపలికి ప్రవేశించింది. అంతపెద్ద పామును తన ఒంటి మీద పెట్టుకున్న ఆ వ్యక్తి గుండె జారి గల్లంతయ్యుంటుంది.

చెట్టుకు ఆనుకుని కూర్చున్న ఆ వ్యక్తి షర్ట్ రెండు బటన్ల మధ్య నుంచి ఆ పాము తలను బయట పెట్టి ఓ లుక్ వేసుకుని మళ్లీ చటుక్కున లోనికి దూరడం ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. అక్కడున్న కొందరు వ్యక్తులు అతన్ని లేపడానికి ప్రయత్నించగా.. వద్దంటూ వారించాడు. ఏ మాత్రం కదిలినా అది కాటేస్తుందంటూ భయపడ్డాడు.

ఎంతసేపటికీ పాము బయటకు రాకపోవడంతో అతని షర్ట్ గుండీలను విప్పదీశారు. దీనితో ఆ పాము నెమ్మదిగా అతని చొక్కా నుంచి బయటికి వచ్చింది. ఈ వీడియోను నాగాలాండ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ రుపీన్ శర్మ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇదికాస్త వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+