వైరల్ వీడియో: ఇదెక్కడి బెగ్గింగ్ రా మావా.. పామును చూపించి మరీ..

బస్సులు, రైళ్లలో భిక్షాటన చేస్తున్న వ్యక్తుల్ని చూస్తుంటాం. చాలా మంది తమ అంగవైకల్యాన్ని ప్రదర్శించి అడుక్కుంటూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం పామును చూపించి బెదిరిస్తూ భిక్షాటన చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుంటే పాము కాటే అని బెదిరిస్తున్నాడు. దీంతో ప్రయాణికులు ఆ పాముకు భయపడి వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటన సబర్మతి ఎక్స్‌ ప్రెస్ ట్రైన్‌ లో జరిగింది.

భారత్ లో యాచకుల సంఖ్య ఎక్కువే. రోడ్లు, బస్‌ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆలయాల్లో భిక్షాటన చేస్తూ యాచకులు ఎక్కువగా కనిపిస్తుంటారు. కొందరు అంగవైకల్యంతో అడుక్కుంటూ ఉంటారు. మరికొంత మంది పసిబిడ్డలను చూపించి భిక్షాటన చేస్తుంటారు. మరికొంతమంది దేవుడి పేరుతో.. మరి కొంతమంది తమ టాలెంట్ ప్రదర్శించి అడుక్కుంటుంటారు. అయితే తాజాగా గుజరాత్‌ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి వినూత్నంగా భిక్షాటన చేసి అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు.

Snake Shakedown on Rails Man Terrifies Sabarmati Express Passengers While Begging with Reptile

గుజరాత్ అహ్మదాబాద్‌లోని మంగోలి రైల్వేస్టేషన్ దగ్గర సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ వ్యక్తి ఏకంగా పాముతో ప్రత్యక్షమయ్యాడు. ఆ పామును చూపించి డబ్బులు ఇవ్వాలంటూ ప్రయాణికులను బెదిరించాడు. దీంతో ప్రయాణికులు ఆ పాముకు భయపడి వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ గా మారింది. ఈ ఘటనను అధికారులు, రైల్వే ప్రొటక్షన్ సిబ్బంది సీరియస్ గా తీసుకుంది. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+