స్నాప్‌డీల్‌కు ఎదురు దెబ్బ: మూర్తి రాజీనామా
ముంబై: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్)గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస మూర్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతేగాక, సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
అయితే, ఏ వ్యాపారం అన్నది ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. కొద్ది నెలల్లో తాను చేయబోయే వ్యాపారం గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తానని శ్రీనివాసమూర్తి తెలిపారు.
స్నాప్‌డీల్‌లో పనిచేసిన అనుభవంతో శ్రీనివాసమూర్తి స్వయంగా వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారని, ఆయన వెళ్లిపోవడం లోటేనని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకులు, సీఈవో కునాల్ బెహల్ అన్నారు.

అయినా, స్నాప్‌డీల్ వ్యాపార స్ఫూర్తిని ఆయన కొనసాగించడం తమకు సంతోషం కలిగిస్తోందని అన్నారు. స్నాప్‌డీల్ ప్రణాళికా విభాగం అధిపతిగా పనిచేసిన రంజన్ కాంత్ ఇటీవలే జబాంగ్‌లో చేరిన సంగతి తెలిసిందే.
అయినా, స్నాప్‌డీల్ సంస్థలో వ్యాపార నిపుణులకు కొదవలేదనే చెప్పాలి. దేశంలోనే కాకుండా విదేశాల్లోని వ్యాపార నిపుణులను కూడా స్నాప్‌డీల్ తన సంస్థలో చేర్చుకుని ఉన్నత స్థానాల్లో నియమించుకుంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications