హత్యా? ఆత్మహత్యా?: మాజీ సీఎం కుమారుడు లండన్‌లో శవమై కనిపించాడు!

ఈటానగర్: యూనైటెడ్ కింగ్‌డమ్(యూకే-బ్రిటన్)లో అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కుమారుడైన శుబాన్సో పుల్ మృతదేహం యూకే ససెక్స్ బ్రైటన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లభ్యమైంది.

స్వదేశానికి తరలించేందుకు..

స్వదేశానికి తరలించేందుకు..

శుబాన్సో పుల్.. దివంగత సీఎం కలిఖో పుల్ మొదటి భార్య దంగ్విమ్సాయి పుల్ కుమారుడు. కుటుంబసభ్యులు, బంధువులు లండన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అతని కుటుంబసభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా శుబాన్సో అక్కడేవుంటున్నట్లు తెలిసింది.

హత్యా? ఆత్మహత్యా

హత్యా? ఆత్మహత్యా

శుబాన్సో ఫుల్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య అనేది తేలాల్సి ఉంది. ఘటనపై అక్కడి పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, జులై 20, 1969 నుంచి ఆగస్టు 9, 2016 వరకు రాజకీయాల్లో కొనసాగారు. 2016 వరకు ఆయన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. హయులియంగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఈయన ఎన్నిక అయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ నేతగా కొనసాగారు.

తండ్రి కూడా సీఎం నివాసంలోనే ఆత్మహత్య..

తండ్రి కూడా సీఎం నివాసంలోనే ఆత్మహత్య..

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జులై 2016లో ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆ పదవిని వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పరిణామాలు నేపథ్యంగా మనస్తాపం చెందిన కలిఖో పులి సీఎం అధికారిక నివాసంలోనే ఉరివేసుకేసి ఆత్మహత్యకు పాల్పడ్డాుడు. తన సూసైడ్ లేఖలో పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు, మరికొందరు రాజకీయ నాయకులు ఉన్నారని తెలిపారు. కాగా, ఆయపై వచ్చిన ఆరోపణలు హైకోర్టులో కొట్టివేయడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+