రాష్ట్ర హోదా ఉద్యమం: సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్!

Ladakh Violence: లడఖ్‌లో దశాబ్దాల తర్వాత అత్యంత తీవ్రమైన హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో ప్రముఖ పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను లేహ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ రక్షణల కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాత నిరసనలు ఘర్షణలకు దారితీశాయి. హింసకు ప్రేరణగా వాంగ్‌చుక్ ప్రసంగాలే కారణమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది.

అరెస్ట్‌కు దారితీసిన పరిణామాలు ఇవే..
రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న వాంగ్‌చుక్‌ను డీజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ నేతృత్వంలోని పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. ఆయనపై మోపిన నిర్దిష్ట అభియోగాలను పోలీసులు ఇంకా వెల్లడించనప్పటికీ, ఈ చర్య వెనుక రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి

Sonam Wangchuk Arrested Amid Ladakh Statehood Protests and FCRA Violations

లడఖ్‌లో హింస, అల్లర్లు: బుధవారం జరిగిన హింసాత్మక నిరసనలలో నలుగురు మరణించారు. 80 మందికి పైగా గాయపడ్డారు. నిరసనకారులు వాహనాలను తగులబెట్టగా.. భద్రతా బలగాలు కర్ఫ్యూ విధించి, బాష్పవాయువు, లైవ్ రౌండ్లను ఉపయోగించాల్సి వచ్చింది. తోటి దీక్షా పరులు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడంతో.. "అరబ్ స్ప్రింగ్" తరహా నిరసనల గురించి వాంగ్‌చుక్ చేసిన "రెచ్చగొట్టే" ప్రసంగాలే హింసకు దారితీశాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.
FCRA లైసెన్స్ రద్దు: అరెస్ట్‌కు ముందు రోజు అంటే గురువారం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వాంగ్‌చుక్ స్థాపించిన ఎన్జీవోఅయిన SECMOL(ది స్టూడెంట్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ మూమెంట్‌ ఆఫ్‌ లద్దాఖ్‌) యొక్క FCRA (Foreign Contribution (Regulation) Act) లైసెన్స్‌ను రద్దు చేసింది.

FCRA ఉల్లంఘనలపై తీవ్ర ఆరోపణలు
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వాంగ్‌చుక్, ఆయన సంస్థలపై తీవ్ర ఆర్థిక ఉల్లంఘనలను ఆరోపించింది. వీటిపై ఇప్పటికే సీబీఐ (CBI), ఆదాయపు పన్ను (Income Tax) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

కీలక ఆరోపణలు:
నిధుల మళ్లింపు: SECMOLకు చెందిన FCRA ఖాతాలో స్థానికంగా సేకరించిన నిధులను జమ చేయడం, అలాగే విదేశాల నుంచి వచ్చిన నిధులను దేశ సార్వభౌమత్వాన్ని అధ్యయనం చేయడం వంటి అనుమతి లేని కార్యకలాపాలకు ఉపయోగించడం.

రూ.6.5 కోట్ల మళ్లింపు: వాంగ్‌చుక్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ శేషోన్ ఇన్నోవేషన్‌కు సుమారు రూ.6.5 కోట్లు దారి మళ్లించబడ్డాయి.

FCRA లేకుండా విదేశీ నిధులు: వాంగ్‌చుక్ స్థాపించిన HIAL (Himalayan Institute of Alternatives Ladakh) FCRA రిజిస్ట్రేషన్ లేకుండానే రూ.1.5 కోట్ల విదేశీ నిధులను అందుకుంది.

వ్యక్తిగత లావాదేవీలు: వాంగ్‌చుక్ తన వ్యక్తిగత ఖాతా నుండి 2021-24 మధ్య రూ.2.3 కోట్లు విదేశాలకు పంపినట్లు, 2018-24 మధ్య వివిధ ఖాతాలలో రూ.1.68 కోట్ల విదేశీ నిధులను అందుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆయనకు చెందిన అనేక వ్యక్తిగత, సంస్థాగత బ్యాంక్ ఖాతాలను ప్రకటించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను వాంగ్‌చుక్ మాత్రం తోసిపుచ్చారు. ప్రభుత్వం తనను జైలులో పెట్టడానికి 'వేటాడుతోందని' ఆరోపించారు.

హింసకు తక్షణ కారణం: దీక్ష విరమణ
రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ రక్షణల కోసం వాంగ్‌చుక్ 15 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అయితే ఆయనతో పాటు 35 రోజుల దీక్షలో పాల్గొన్న వృద్ధులు త్సెరింగ్ అంగ్‌చుక్ (72), తాషి డోల్మా (60) పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం లడఖ్ యువతలో కోపాన్ని రేకెత్తించింది. వారి అనారోగ్యం కారణంగా వాంగ్‌చుక్ తన దీక్షను విరమించుకున్నారు.ఈ పరిణామం బుధవారం ఉదయానికల్లా షట్‌డౌన్, ఘర్షణలకు దారితీసింది. వాంగ్‌చుక్ అరెస్ట్, ఆయన ఎన్జీవోపై వచ్చిన ఆర్థిక ఆరోపణలు లడఖ్ ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+