మరోసారి ఈడీ విచారణకు సోనియా హాజరు-పిల్లలు రాహుల్, ప్రియాంకతో కలిసి..
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి సోనియా విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మరోసారి ఆందోళనలు చేపడుతున్నాయి.
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈ మధ్యాహ్నం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కార్యాలయానికి వచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు సోమవారంలోగా రావాలని కాంగ్రెస్ అధినేత్రికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ శుక్రవారం తాజా సమన్లు జారీ చేసింది.

బిజెపి పాలిత కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలను ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతల తీవ్ర నిరసనల మధ్య ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం దాదాపు రెండు గంటల పాటు ఆమెను ఇప్పటికే ప్రశ్నించింది. ఆ తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా తన తల్లితో కలిసి ఢిల్లీలోని దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో గత సిట్టింగ్‌లో 75 ఏళ్ల సోనియా గాంధీని రెండు డజన్లకు పైగా ప్రశ్నలు అడిగారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను కలిగి ఉన్న కాంగ్రెస్ ప్రమోట్ చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
సోనియాపై ఈడీ దర్యాప్తు నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బలగాలను మోహరించారు. సెంట్రల్ ఢిల్లీలోని విద్యుత్ లేన్‌లోని ఆమె ఇంటికి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మధ్య 1 కి.మీ. పరిధిలో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇదే కేసులో రాహుల్ గాంధీని కూడా దర్యాప్తు సంస్థ గత నెలలో ఐదు రోజుల పాటు 50 గంటలకు పైగా ప్రశ్నించింది.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications