ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: అబ్జర్వేషన్ లో..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ ఉదయం దేశ రాజధానిలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల కోసం చేరారు. డాక్టర్లు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రెండు రోజులుగా దగ్గుతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం సాయంత్రం దగ్గు తీవ్రం కావడం వల్ల ఆసుపత్రిలో చేరారని తెలిపాయి.

చాలాకాలంగా ఢిల్లీలో కాలుష్యం తీవ్రతరమౌతూ వస్తోన్న విషయం తెలిసిందే. అక్కడి వాతావరణం విషతుల్యంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భయానకంగా పెరిగింది. దీనికి చలి తోడైంది. పొగమంచు కమ్ముకుంటోంది. ఉదయం 8-9 గంటల వరకు కూడా వెలుగు ప్రసరించనంతగా దట్టమైన మంచు ఏర్పడుతోంది. ఈ పరిణామాలతో సోనియా గాంధీ ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో దగ్గు తీవ్రం కావడం వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని పేర్కొన్నాయి.

Sonia Gandhi Rushed to Sir Ganga Ram Hospital Under Medical Observation

ఆమెను అబ్జర్వేషన్ కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు మంగళవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాయి. ప్రస్తుతం సోనియాగాంధీ గంగారామ్ ఆసుపత్రిలో ఛెస్ట్ స్పెషలిస్ట్ సారథ్యంలోని డాక్టర్ల టీమ్ పర్యవేక్షణలో ఉన్నారు. డాక్టర్లు ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోన్నారు. సాధారణ చెకప్ నిర్వహిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని, అబ్జర్వేషన్‌లో ఉన్నారని పీటీఐ తెలిపింది.

ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం, సోనియా గాంధీ మెడికల్ హిస్టరీ ప్రకారం.. ఆమె క్రానిక్ కాఫ్ (తీవ్ర దగ్గు)తో బాధపడుతున్నారు. ఢిల్లీలో అధిక వాయు కాలుష్యం ఉన్నప్పుడు ఆమె క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఆమె దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతుండటం, ఢిల్లీ కాలుష్య స్థాయి పెరిగిన నేపథ్యంలో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటోన్నారని పీటీఐకి వివరించింది. ఆమె ఎన్నిరోజులు ఆసుపత్రిలో ఉంటారు, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+