వివాహేతర సంబంధం: తల్లి ప్రియుడిని చంపేసిన కుమారులు

రాజ్‌కోట్: తమ తల్లితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్న వ్యక్తిని ఆమె కుమారులు హత్య చేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లాలోని కానవదాల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు కానవదాల గ్రామానికి చెందిన భికా మక్వానా(37)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. వాడాలి గ్రామానికి చెందిన నిందితులు రాజేష్ మహిదా, నీలేష్ మహిదా, రాంభాయి కానవాడాల సరిహద్దులో గురువారం తీవ్రంగా కొట్టి పడేశారు. గమనించిన స్థానికులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన మక్వానా ధోరాజిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Sons kills mother's paramour in Rajkot village

గత ఐదేళ్లుగా నిందితుల తల్లితో మృతుడు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. అది నచ్చకపోవడంతోనే ఆమె కుమారులు మక్వానాను కొట్టి చంపారని భావిస్తున్నారు.
కాగా, మృతుడి సోదరుడు వినోద్ మక్వానా నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇది ఇలా ఉండగా తనపై మక్వానా అత్యాచారానికి పాల్పడ్డాడని నిందితుల తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కుమారులను చంపుతానని బెదిరించి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇరు పక్షాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+