Sourav Ganguly: పెళ్లికి ముందు దాదా లవ్‌స్టోరీ..లవర్‌బాయ్‌గా చిలిపి పనులు..!

Sourav Ganguly:సాధారణంగా సినిమాల్లో లవ్‌స్టోరీస్ చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అయితే నిజ జీవితంలో మాత్రం ఇద్దరు ప్రేమించుకుంటే వారి కథ వినేందుకు మరింత ఆసక్తి కలుగుతుంది. అదే సెలబ్రిటీల ప్రేమ కహానీ అయితే అందులో మరింత కిక్ ఉంటుంది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ లవ్ స్టోరీ తాజాగా వెలుగులోకి వచ్చింది.

అచ్చం సినిమాను తలపించేలా బెంగాలీ దాదా లవ్ ‌స్టోరీ సాగింది. అయితే గంగూలీ డోనాలు ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించి మొత్తానికి ఒక్కటయ్యారు. ఇప్పటికీ దాదా పెళ్లయి పాతికేళ్లు అవుతోంది. వీరిద్దరికీ ఒక కుమార్తె ఉంది. డోనాను పెళ్లి చేసుకునేందుకు దాదా పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వీరిద్దరూ ఎలా ఎక్కడ కలిశారు..? దాదా-డోనాల రొమాంటిక్ లవ్ స్టోరీకి బీజం ఎక్కడ పడింది..?

gambeer

డోనాతో పెళ్లికంటే ముందే సౌరవ్ గంగూలీకి పరిచయం ఉంది. ఇంకా చెప్పాలంటే వీరిద్దరూ చిన్నప్పటి నుంచే ఒకరినొకరు చూసుకునేవారు కానీ పెద్దగా మాటల్లేవ్. అప్పట్లోనే గంగూలీకి డోనాపై చిన్నపాటి క్రష్ ఉండేదని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ప్రతి రోజు ఫుట్‌బాల్ ఆడేందుకు సౌరవ్ గంగూలీ డోనా ఇంటి ముందు నుంచే వెళ్లే వాడు. డోనా బయటకు వస్తుందేమో అనే ఒక చిన్న ఆశతో ఆమె ఇంటి ముందు కాసేపు ఆగేవాడు. కానీ డోనా వచ్చేది కాదు.

ఓరోజు సౌరవ్ గంగూలీ ఆమెను ఎలాగైనా కలవాలనే ఉద్దేశంతో డోనా ఇంట్లోకి షటిల్ కాక్ వేశాడు. ఈ నెపంతో ఆమెను కలవొచ్చని భావించాడు. అనుకున్నదే జరిగింది. షటిల్ కాక్ కోసం లోపలికి వెళ్లిన బెంగాలీ బాబు.. డోనాతో మాటా మాటా కలిపాడు. వెంటనే డేటింగ్‌‌కు వస్తావా అని అడిగాడు. ఇందుకు వెంటనే ఓకే చెప్పేసింది డోనా

gambeer

ఇక ఇద్దరూ ఓ చైనీస్ రెస్టారెంట్‌లో కలిశారు. అక్కడ సౌరవ్ గంగూలీ రకరకాల ఫుడ్ ఐటెమ్స్ ఆర్డర్ ఇచ్చినట్లు డోనా గుర్తుచేసుకుంది.అక్కడ డేటింగ్‌తో మొదలై అది ప్రేమ వరకు దారితీసింది. అదే సమయంలో సౌరవ్ గంగూలీకి ఇంగ్లాండ్‌లో జరిగే లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌కు పిలుపొచ్చింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఇరుకుటుంబాలకు తెలియడంతో రెండు కుటుంబాల మధ్య కాస్త గొడవ జరిగింది.

అయినా సరే కథలో హీరో హీరోయిన్లు ఎక్కడా వేరవలేదు. చాలా రహస్యంగా కలుసుకునేవారు ప్రేమించుకునేవారు. ఇద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇక ఇంగ్లాండ్ నుంచి తిరిగొచ్చిన గంగూలీ తన స్నేహితుడి ఇంట్లో డోనాను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చాలాకాలం వరకు వారి పెద్దలకు తెలియకుండా ఇద్దరూ విషయాన్ని దాచి ఉంచారు. చాలా కాలానికి విషయం తెలియడంతో చిన్న గొడవైనప్పటికీ.. చివరకు పెద్దలు ఒప్పుకోవడంతో సౌరవ్-డోనాల ప్రేమకథ సుఖాంతమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+