BCCI అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా?
BCCI అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నట్లు ఈ డాషింగ్ ఓపెనర్ ట్వీట్ చేశారు. 30 సంవత్సరాలుగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞ తలు తెలిపారు.ఇటీవల రెండుసార్లు కేంద్ర మంత్రి అమిత షా గంగూలీతో భేటీ అయ్యారు. ఆయన స్వయంగా గంగూలీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు.

పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు గంగూలీకి అప్పగించబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై గంగూలీ పూర్తి స్పష్టత ఇవ్వలేదు. 30 సంవత్సరాలుగా క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని, అందుకు వీలైనంత ఎక్కువమందికి సహాయం చేసేలా ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications