వర్షాకాలం వచ్చేసింది: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

న్యూఢిల్లీ: వేసవి కాలం ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు చల్లటి కబురు అందింది. అనుకున్నదాని కంటే మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ గుండా దేశంలోకి ప్రవేశించాయి.

మంగళవారం ఈ రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు పేర్కొంది. తొలుత జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.

Southwest monsoon hits Kerala: IMD

అయితే, మూడు రోజుల ముందుగానే అంటే మే 29నే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. కాగా, ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.

రుతుపవనాల రాకతో కేరళతోపాటు తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా, రుతుపవనాలు సోమవారమే కేరళను తాకినట్లు స్కైమెట్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+