viral video: దివ్యాంగురాలు చేస్తున్న పనికి నెటిజన్లంతా సెల్యూట్
న్యూఢిల్లీ: అన్ని అవయవాలు బాగున్నవారు కూడా కొందరు శ్రమించేందుకు ఇష్టపడరు. అయితే, ఒక దివ్యాంగురాలు మాత్రం తన వైకల్యాన్ని అధిగమించి అందరికి స్ఫూర్తినిచ్చే విధంగా నిలిచారు. "వెన్ ద గో గెట్స్ టఫ్, ది టుఫ్ గెట్ గోయింగ్" అనే సామెత గురించి మీరు విని ఉండవచ్చు. ఈ డెలివరీ ఏజెంట్ కూడా దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
వీల్ చైర్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న మహిళ
ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఒక వీడియో క్లిప్‌లో.. వీల్‌చైర్‌లో ఆహారాన్ని డెలివరీ చేస్తున్న దివ్యాంగురాలైన మహిళను చూడవచ్చు. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
స్విగ్గీలో డెలివరీ ఏజెంట్‌గా..
స్వాతి మలివాల్ షేర్ చేసిన ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. వీల్ చైర్‌పై ఆహారాన్ని డెలివరీ చేస్తున్న ప్రత్యేక సామర్థ్యం ఉన్న మహిళను చూడవచ్చు. ఆమె వెనుక కారులో ఉన్న ప్రయాణికుడు 6 సెకన్ల క్లిప్‌ను రికార్డ్ చేశాడు. ఆమె యూనిఫాం, బ్యాగ్‌పై ఉన్న లోగో ప్రకారం.. డెలివరీ ఏజెంట్ స్విగ్గీకి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటమిని అంగీకరించడం నేర్చుకోలేదంటూ..
"అయితే, జీవితం కష్టం, కానీ మేము ఓటమిని అంగీకరించడం నేర్చుకోలేదు. ఆత్మకు వందనం" అని స్వాతి మలివాల్ ఆ వీడియో క్లిప్‌ను పంచుకుంటూ వ్యాఖ్యానించారు.
స్ఫూర్తినిచ్చారంటూ దివ్యాంగురాలిపై ప్రశంసల వర్షం
ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత వీడియో 2 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది. నెటిజన్లు కూడా మహిళను ప్రశంసించారు. వారి ఆలోచనలను పంచుకున్నారు. "ఆమెకు సెల్యూట్ చేయండి. 'ఇది నాకు చాలా కష్టం, నేను చేయగలనా?' అని చెప్పే వ్యక్తులకు ఇది చాలా ప్రేరణనిస్తుంది" అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. మరొక వినియోగదారు, "నిజంగా నన్ను ప్రేరేపించారు" అని వ్యాఖ్యానించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications