Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్రహ్మకుమారిస్ చీఫ్ దాది ర‌త‌న్‌ మోహిని కన్నుమూత

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్ చీఫ్ దాది ర‌త‌న్‌ మోహిని ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆమె మరణించినట్లు బ్రహ్మకుమారిస్ సంస్థ పీఆర్వో బీకే కమల్​ వెల్లడించారు. మార్చి 25 వ తేదీన ఆమె 100వ పుట్టిన రోజు వేడుకను చేసుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్రహ్మకుమారిస్ గా ర‌త‌న్ మోహిని రికార్డు సృష్టించారు.

గత కొన్ని రోజుల నుంచి దాది రతన్ మోహిని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె పరిస్థితి మ‌రింతగా క్షీణించింది. దీంతో ఆమెను రాజస్థాన్ లోని అబూ రోడ్డులో ఉన్న శాంతివనంలోని ట్రామా సెంటర్ కు డయాలసిస్ కోసం తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

Spiritual Leader Dadi Ratan Mohini of Brahma Kumaris Dies

ఆమె పార్ధివ దేహాన్ని శాంతివనంలోని ట్రామా సెంటర్ నుంచి రాజస్థాన్​ మౌంట్​ అబులో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు సంస్థ అధికారులు వివరించారు. ప్రజల సందర్శనానర్థం కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నట్లు తెలిపారు. ఆమె అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని అన్నారు.

పాకిస్థాన్ సింధ్‌లోని హైద‌రాబాద్‌లో 1925, మార్చి 25న దాది ర‌త‌న్ మోహిని జ‌న్మించారు. ఆమె ఒరిజిన‌ల్ పేరు ల‌క్ష్మీ. హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్రహ్మకుమారిస్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌లో బ్రహ్మకుమారీస్ తరపున దాది ర‌త‌న్ మోహిని పాల్గొన్నారు. అలాగే, హాంకాంగ్, సింగ‌పూర్, మ‌లేసియాతో పాటు ఆసియాలోని అనేక దేశాల్లో ఆమె పర్యటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+