Spitting On Roti: వీడు మనిషేనా అసలు.. రోటీలు చేస్తూ ఉమ్మివేసిన వ్యక్తి..
ఇంట్లో వంట ఏం చేసుకుంటాం బయట నుంచి తెప్పించుకుంద్దాం అనుకుంటారు. వెంటనే ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పెడతారు. లేదా హోటల్ కు వెళ్లి తింటారు. అయితే మనం వెళ్లిన హోటల్ మంచిదేనా.. వారు వంట ఎలా చేస్తున్నారో అసలు పట్టించుకోం. రుచిగా ఉందా అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ కొన్ని హోటళ్లలో దారుణంగా వంట చేస్తారు. ఓ హోటల్లో ఓ వ్యక్తి తందూరి రోటీ పై ఉమ్ముతూ రోటీ చేశాడు. ప్రస్తుతం ఈ విడీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ లో ఘటన
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా బిజ్నోర్‌లోని ఓ హోటల్‌లో అర్బాజ్ అనే యువకుడు రోటీ చేస్తున్నప్పుడు రోటీలపై ఉమ్మివేసాడు.ఈ తంతగాన్ని అక్కడే ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్థానిక పోలీసులు ఈ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు
గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. దీంతో ప్రజలకు హోటళ్లకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇదే యూపీలో గతేడాది.. లక్నోలోని కాకోరి ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న దాబాలో రోటీలు చేయడానికి పిండిపై ఉమ్మివేసిన ఘటన అప్పట్లో వైరల్ అయింది. ఓ ప్రాంతంలో వివాహ వేడుకలో రోటీలు తయారు చేస్తూ పిండిపై ఉమ్మివేస్తూ ఓ వ్యక్తి కెమెరాకు దొరికోపాయాడు. దీంతో పెళ్లిలో భోజనం చేయాలన్నా ఆలోచించాల్సి వస్తుంది.
@sachingupta787 वीडियो की जांच हो ,तुरन्त कैटरर्स और सुहैल पर कार्यवाही हो ,वीडियो एरोमा होटल मेरठ की बताई जा रही है।@meerutpolice @Uppolice @dgpup @AmarUjalaNews @JagranMeerut @Live_Hindustan pic.twitter.com/8Ik1xc7AUT
— शैंकी वर्मा,प्रसपा नेता,मेरठ (@shankyvermapspl) February 19, 2021












Click it and Unblock the Notifications