జైపూర్ అమ్మాయి మెడలో తాళి కట్టిన శ్రీశాంత్
తిరువనంతపురం: వివాదాస్పద క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ జైపూర్ రాచకుటుంబానికి చెందిన అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వృత్తిరీత్యా జ్యువెల్లరీ డీజైనర్ అయిన అమ్మాయిని శ్రీశాంత్ గురువయూరులోని శ్రీకృష్ణ దేవాలయంలో గురువారం పెళ్లి చేసుకున్నాడు.
వివాహానికి ముందు వేడుకలు బుధవారంనాడు కొచ్చిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగాయి. ఈ వేడుకలకు శ్రీశాంత్, పెళ్లి కూతురు భువనేశ్వరి సన్నిహిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భువనేశ్వరి కుమారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 8వ తేదీన రాజస్థాన్ నుంచి కొచ్చికి చేరుకుంది.

శ్రీశాంత్, భువనేశ్వరి కుమారి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లినప్పుడు కూడా శ్రీశాంత్‌కు భువనేశ్వరి కుమారి మద్దతుగా నిలిచింది. వివాహం తర్వాత దంపతులు ఎర్నాకులం జిల్లాలోని కొత్తమంగళంలో గల తమ పూర్వీకుల ఇంటికి వెళ్తారు. వివాహానంతర వేడుకలు కొచ్చిలో జరుగుతాయని అంటున్నారు.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ మే 16వ తేదీన అరెస్టయ్యాడు. ఆ తర్వాత జూన్ 11వ తేదీ వరకు జైలులో ఉన్నాడు. శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసి) క్రికెట్ నుంచి జీవితకాలం నిషేధం విధించింది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications