Kaviya Maran : ఏం ఎక్స్‌ప్రెషన్స్‌ సామి ..ఆ అందానికి ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే..!

కావ్య మారన్ .. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎందుకంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్‌ను ఇష్టపడేవారికి కావ్య మారన్ తెలియకుండా ఉండరు.సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే.. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారామె.

Kavya maran

కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్‌ టీం గెలిచినా, ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ అన్ని ఇన్ని కావు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కాని.. కావ్య మారన్‌ని ఇష్టపడని వారుండరు. కావ్య మారన్ కోసమే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచులు చూసే వారి కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే గత కొద్ది సీజన్స్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీం అనుకున్నంతగా రాణించలేకపోతుంది.

Kavya maran

దీంతో కావ్య మారన్ తన టీం మ్యాచులకు హాజరుకావడం లేదు.ఇదే విషయాన్ని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చెప్పడం జరిగింది. ఐపీఎల్ సమయంలో కావ్య మారన్‌ను అలా ముభావంగా చూడలేకపోతున్నానని.. హైదరాబాద్‌ టీంలో మంచి ఆటగాళ్లను కొనుగొలు చేసి ఆమె మొహంలో ఆనందం నింపేలా చేయాలని కావ్య మారన్‌ తండ్రి కళానిధి మారన్‌కు విజ్క్షప్తి చేశారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ నటించిన జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కావ్య మారన్ తళుక్కున మెరిశారు.జైలర్ సినిమాను కావ్య మారన్‌ తండ్రి కళానిధి మారన్‌ నిర్మించారు.

దాంతో ఈ సినిమా ఈవెంట్‌కు వచ్చిన కావ్య మారన్ తన అందంతో అక్కడున్న వారందరిని కట్టిపడేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ స్టేజ్ మీద పాటలు పాడుతుంటే.. కావ్య మారన్ హమ్ చేస్తూ కనిపించారు. ఆ సమయంలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హీరోయిన్స్ సైతం కావ్య పాప అందం ముందు బలాదూరే అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+