స్టాలిన్ ఓడించిన టీవీకే అభ్యర్ది, విజయ్ సీఎం కావాలంటే.. వారు మద్దతు ఇస్తేనే..!!
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో మరో సంచలనం. టీవీకే అభ్యర్ధి చేతిలో సీఎం స్టాలిన్ పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం కొనసాగుతోంది. డీప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. 22 మంది మంత్రలు ఓటమి దిశగా వెళ్తున్నారు. అన్నా డీఎంకే లోనూ కీలక నేతలు ఓటమి అంచుల్లో ఉన్నారు. విజయ్ కొట్టిన దెబ్బకు రెండు ద్రవిడ పార్టీలకు మైండ్ బ్లాక్ అయింది. అయితే.. ఇప్పుడు ఈ రెండు కూటముల్లో ఒకరి మద్దతుతోనే విజయ్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఏర్పడింది. విజయ్ మాత్రం వారి వైపే మొగ్గు చూపుతున్నారు.
తమిళనాడులో సంచలన ఫలితాలు నమోదు అవుతున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ తిరిగి తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాగా కనిపించారు. ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. చివరకు స్టాలిన్ కొళత్తూరులో టీవీకే అభ్యర్ధి బాలు చేతిలో పరాజయం పాలయ్యారు. డీఎంకే ముఖ్య నేతలు ఓటమి బాట పట్టారు. ఇక.. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం టీవీకే 104 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. డీఎంకే 76, అన్నా డీఎంకే 54 నియోజకవర్గాల్లో ఆధిక్యతలతో కొనసాగుతున్నాయి. అయితే.. టీవీకే ఆధిక్యతలో ఉన్న పలు నియోజకవర్గాల్లో మెజార్టీలు చాలా స్వల్పంగా ఉన్నాయి. దీంతో... చివరి ఫలితం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ కనిపిస్తోంది. దాదాపు 11 సీట్లు 3 వేల మెజార్టీ లోపలే ఉన్నాయి. 12 సీట్లు 2 వేల మెజార్టీ తో కనిపిస్తున్నాయి.

అదే విధంగా మరో 14 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కనిపిస్తోంది. తమిళనాడులో విజయ్ సీఎం కావాలంటే 118 స్థానాలు గెలవాలి. అయితే.. విజయ్ ఒంటరిగా ఈ సీట్లు సాధించే అవకాశం కనిపించటం లేదు. అటు డీఎంకే తాము ఎవరి మద్దతు తీసుకోం.. ఎవరికీ మద్దతు ఇవ్వమనే సంకే తాలు ఇస్తోంది. దీంతో.. అన్నాడీఎంకే కూటమి మద్దతు ఇస్తేనే విజయ్ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. డీఎంకే తరహాలో అన్నా డీఎంకే కూటమి సైతం నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతాయి.
అయితే, కాంగ్రెస్ సహా చిన్న పార్టీలు బయటకు వచ్చి మద్దతు ఇచ్చినా విజయ్ కు మేజిక్ ఫిగర్ వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. దీంతో.. ఇప్పుడు బీజేపీ తో సంబంధం లేకుండా అన్నా డీఎంకే మద్దతు అయితే.. విజయ్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో.. అందుకు అన్నా డీఎంకే మద్దతు ఇస్తే విజయ్ సీఎం అవుతారు. తుది ఫలితాల వెల్లడి తరువాత పొత్తులు... లెక్కల పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications