అలా చేస్తేనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అంటున్న దళపతి విజయ్‌..!

తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం తధ్యమని స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు చెన్నై సమీపంలోని పనయూర్‌లో నిర్వహించిన పార్టీ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని కీలక ప్రకటనలు చేశారు.

అలానే పార్టీని క్షేత్ర స్థాయిలో సైతం బలోపేతం చేసేలా మైటీవీకే పేరుతో యాప్‌ను లాంచ్‌ చేశారు. కార్యకర్తలు, ప్రజలు తమ యాప్‌ ద్వారా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వివరాలు నమోదు చేసుకొని సమస్యలను తెలుపవచ్చని వెల్లడించారు. పార్టీ ప్రకటనలను వేగంగా పొందవచ్చని వివరించారు. ప్రజలతో మరింతగా మమేకం అయ్యేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అన్నారు.

star-hero-and-tvk-chief-vijay-launches-party-app-at-chennai

విజయ్ మాట్లాడుతూ.. 1967లో డీఎంకే, 1977లో అన్నాడీఎంకే.. ఈ రెండు కొత్త పార్టీలు అప్పట్లో పాత, బలమైన పార్టీలను ఓడించాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో టీవీకే కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతుందని తెలిపారు. తమకు గ్రామీణ స్థాయిలోనే బలమైన మద్దతు కనిపిస్తోందని చెప్పారు.

ఏకతాటిపైకి తీసుకువస్తేనే..

ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కంజీవరం నటరాజన్ అన్నాదురై సిద్ధాంతాల్ని విజయ్ ప్రస్తావించారు. ఆయన తరహాలో ప్రజల్ని కలవబోతున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని వివరించారు. వారి కోసం పాలన చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు.

ఇక ప్రతి బూత్‌కు కనీసం 20 మంది చురుకైన కార్యకర్తలు అవసరమని విజయ్ స్పష్టం చేశారు. "ఎన్నికల్లో విజయం ఓ రోజు పనితో రాదని.. ప్రతి రోజు ప్రజల మధ్య ఉండాలన్నారు. వారి అవసరాలు తెలుసుకుని, సంఘటనలపై స్పందిస్తూ నమ్మకాన్ని సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో గెలవగలమని స్పష్టం చేశారు.

star-hero-and-tvk-chief-vijay-launches-party-app-at-chennai

మరోవైపు విజయ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం "జన నాయకన్‌". ఈ సినిమాపై కోలీవుడ్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన "ఫస్ట్ రోర్" గ్లింప్స్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రియమణి, మమితా బైజు, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కాబోతోంది. ఇదే విజయ్ నటించే చివరి మూవీ అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+