ఇలాంటి రోజు మళ్లీ రావాలంటే 2303 వరకు ఎదురు చూడాలి: మిస్ అవ్వొద్దు
Shortest day 2023: అంతరిక్ష చరిత్రలో ఓ అద్భుతం నేడు ఆవిష్కృతం కానుంది. ఇలాంటి సందర్భం కోసం అంతరిక్ష పరిశోధకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నారు. 1903 డిసెంబర్ 23వ తేదీ తరువాత మళ్లీ అలాంటి ఖగోళ అద్భుతం సంభవించబోతోండటమే దీనికి కారణం.
ఈ ఏడాదిలో షార్టెస్ట్ డే ఏర్పడబోతోంది. పగటి సమయం తక్కువగా ఉంటుంది. మిగిలిన రోజుల కంటే రాత్రి సమయం ఎక్కువసేపు ఉంటుంది. డిసెంబర్ 22, 23వ తేదీల్లో సంభవించబోయే ఇలాంటి అరుదైన సందర్భం ఏర్పడాలంటే మళ్లీ 2303వ సంవత్సరం వరకు ఎదురు చూడక తప్పదు.

ఈ పరిణామాన్ని చలికాలపు అయనాంతం (Winter Solstice) గా పిలుస్తారు శాస్త్రవేత్తలు. ప్రతి సంవత్సరం ఇది ఏర్పడేదే అయినప్పటికీ.. ఈ సారి మాత్రం దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా ఈ చలికాలపు అయనాంతం అనేది డిసెంబర్ 21వ తేదీన సంభవిస్తుంటుంది.
ఈ సారి మాత్రం తేదీ మారింది. 22/23వ తేదీల్లో ఇది ఏర్పడనుంది. వివిధ దేశాల టైమ్ జోన్, ఉత్తరధృవం సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ శీతాకాలపు అయనాంతాన్ని లెక్కిస్తారు. ఈ షార్టెస్ట్ డే.. లాంగెస్ట్ నైట్ ప్రభావం ఉత్తరధృవంలో అధికంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య గల తేడా ఏమిటనేది అక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, అది దాని అక్షం మీద 23.4 డిగ్రీలు వంగి ఉంటుందనే విషయం తెలిసిందే. అలా తిరిగే సమయంలో వంపు ఉన్న ప్రాంతం సూర్యుడి దిశగా ఉంటే పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడికి దూరంగా ఉంటే- చీకటి ఎక్కువ సేపు ఉంటుంది.
ఈ స్థితిలో ఉత్తరార్ధ గోళం సూర్యుడికి దూరంగా ఉండబోతోంది. ఉత్తర ధృవానికి సూర్యరశ్మి చాలా పరిమితంగా సోకుతుంది. ఫలితంగా అక్కడ రాత్రి సమయం సుదీర్ఘంగా ఉంటుంది. పగటి వెలుతురు 7 గంటల 14 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు అక్కడ పడటం కూడా అరుదు. భారత కాలమానాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఉదయం 8.57 నిమిషాలకు శీతాకాలపు అయనాంతం ఆరంభమైంది.












Click it and Unblock the Notifications