భర్తను వదిలేసిన మహిళ బయటకు వెళ్లింది రాత్రి పొలంలో ఏం జరిగిందంటే ?, సీసీటీవీల్లో !

బెంగళూరు/ధారవాడ: వివాహం చేసుకున్న మహిళ కొన్ని సంవత్సరాలు ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతుల మధ్య గొడవలు జరగడంతో తరువాత విడాకులు తీసుకున్నారు. పుట్టింటిలో ఉంటున్న మహిళ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఊరి బయట కనపడకుండా పోయిన మహిళ దారుణ హత్యకు గురై కనిపించడం కలకలం రేపింది.

కర్ణాటకలోని ధారవాడ తాలూకా కమలాపురలో జంట హత్యల ఘటన మరువక ముందే శుక్రవారం ధారవాడ నగర శివార్లలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.హెబ్బల్లి అగసిలోని మణికంఠ నగర్‌ నుంచి గోవనకొప్ప వెళ్లే లోపలి రోడ్డులోని పొలానికి సమీపంలో మహిళ తలపై బండా రాయితో హత్య చేశారు. హత్యకు గురైన మహిళను కిళ్ల బరంగాయికి చెందిన రూపా సవదత్తి అలియాస్ రూపా (42)గా గుర్తించామని పోలీసులు తెలిపారు..

girl-

మృతురాలు కుటుంబీకులు గురువారం ధారవాడ సబ్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌లో రూపా కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. రూపా కనిపించకుండా పోయిన రెండు రోజులకే ఆమె హత్యకు గురైయ్యిందని వెలుగు చూసింది. ప్రశాంత కోసం రూపా నిత్యం నగరంలోని ఒక దర్గాకు వెళ్లేది. గురువారం కూడా దర్గాకు వెళ్లిన రూపా ఆ దర్గాలో నుంచి బయటకు వచ్చినట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని పోలీసులు తెలిపారు.

దర్గా నుంచి బయటకు వచ్చిన తర్వాత రూపా కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిన రూపా ధారవాడ నగర శివార్లలోని పొలంలో శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు రూపా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసు సూపరింటెండెంట్ లోకేశ్ జగలసార సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణకు ఆదేశించారు.

అక్రమ సంబంధం కారణంగా రూపా హత్యకు గురైయ్యిందా ?, లేక ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసి పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. భర్తకు దూరంగా ఉంటున్న రూపా ఓ వ్యక్తితో చనువుగా ఉంటున్నదని, రూపా శవమై కనిపించిన తరువాత అతను కనిపించకుండా పోయాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+