ఆ ఎద్దు పేడలో ‘బంగారం’: ఇంట్లో కట్టేసి పేడలో వెతికేస్తున్నారు, ఇక అదేపని!
చండీగఢ్: ఓ ఎద్దు పేడ కోసం ఓ కుటుంబం ఎదురు చూస్తోంది. ఆ ఎద్దు ఎప్పుడు పేడ వేసినా.. వెంటనే తట్టలో ఎత్తి అందులో ఏమైనా ఉందా? అని వెతుకుతోంది. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ఆ ఎద్దు ఆ కుటుంబానికి చెందిన ఒకరి బంగారు నగలు మింగిన నేపథ్యంలోనే వారు ఇలా చేస్తుండటం గమనార్హం. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

కూరగాయల బుట్టలో నగలు..
వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రం సిర్సా జిల్లా కలన్‌వాలీలో నివసిస్తున్న వ్యాపారి జనక్ రాజ్ భార్య, కోడలు శనివారం రాత్రి ఓ పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత తమ ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారు నగలను తీసి.. కూరగాయల వ్యర్థాలు పడేసే బుట్టలో పెట్టారు. ఆ విషయం మరిచిపోయి మరుసటి ఉదయం కూరగాయలతోపాటు నగలను కూడా బయటపడేశారు.

గుర్తుకొచ్చి వెతికితే...
కాసేపటికి తర్వాత బంగారు నగల విషయం గుర్తుకు వచ్చి అంతటా వెతికారు. చివరకు చెత్తబుట్టలో వేశామని గుర్తుకు రావడంతో ఆ చెత్త ఎక్కడ వేశారో అక్కడ వెతకడం ప్రారంభించారు. అప్పటిక ఓ ఎద్దు ఆ కూరగాయలను తినేసి వెళ్లిపోయింది. అయితే, గుమ్మం వద్ద ఒక చెవిపోగు మాత్రం లభించింది.

సీసీ కెమెరాల్లో కనిపించిన ఎద్దు..
తమ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ చూసి.. వారు పాడేసిన కూరగాయలను ఓ ఎద్దు తిన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆ ఎద్దును స్థానికంగా వెతికి నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే కట్టేశారు. ఆ ఎద్దుకు బాగా గడ్డి, చెరుకు పిప్పి పెట్టారు. తమ బంగారు నగలు పేడలో ఏమైనా వస్తాయేమోనని ఇలా చేశారు. ఆ ఎద్దు పేడ వేసిన ప్రతిసారీ ఓ తట్టలో ఎత్తి వెతికారు.

పేడలో బంగారం కోసం పాట్లు...
ఇలా ఆ కుటుంబసభ్యులు చాలా సార్లు చేసినప్పటికీ ఆ ఎద్దు పేడలో మాత్రం వారి బంగారు నగలు దొరకలేదు. మూడు రోజులు గడిచినా బంగారు నగలు రాకపోవడంతో.. చివరకు పశువుల వైద్యులను కూడా సంప్రదించారు. అయితే, ఆ ఎద్దు ఒక వేళ బంగారు నగలను కూరగాయలతోపాటు తిన్నప్పటికీ వెంటనే బయటకి రాకపోవచ్చని.. సమయం పట్టవచ్చని చెబుతున్నారు వైద్యులు. దీంతో ఆ కుటుంబసభ్యులు తమ నగల కోసం ఎదరుచూపులు చూడాల్సిన సమయం మరింత పెరిగినట్లయింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications