'టీ తాగనీయని చాయ్‌వాలా: సోషల్ మీడియాలో జోక్స్, అమెరికాని బీట్ చేసిన మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 రద్దు చేసినట్లు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే నెటిజన్లు ఈ అంశంపై స్పందించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో ఇది హల్ చల్ సృష్టించింది. అంతేకాదు, దీనిపై జోకులు కూడా పేల్చుకున్నారు.
సోషల్ మీడియాలో వచ్చిన జోకులలో కొన్ని..
- ప్రధాని మోడీ నల్ల ధనంపైన సర్జికల్ స్ట్రయిక్స్ చేశారు.
- ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఇలా రాశారు. ట్రాఫిక్‌ను ఉల్లంఘించినందుకు ఓ పోలీసుకు నేను రూ.500 ఇచ్చాను. కానీ అతను నాకు రూ.100 ఫైన్ వేశాడు.
- ట్రంప్ ప్లేడ్ మోడీ కార్డ్, మోడీ ప్లేడ్ ట్రంప్ కార్డ్.
- బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు పరేష్ రావల్ సెటైరిక్ ట్వీట్ చేశారు. అవార్డులు వెనక్కి ఇచ్చారని, దీనిని నిరసిస్తూ ఇప్పుడు రైటర్స్, డైరెక్టర్, ఇంటలెక్చువల్స్ తదితరులు వారి వారి రూ.500, రూ.1000 నోట్లు తిరిగివ్వాలి.
- భర్తల జేబుల నుంచి రూ.500, రూ.1000 నోట్లు తీసుకుంటున్న భార్యల పైన సర్జికల్ స్ట్రయిక్స్
- అమెరికా ఓట్లను కౌంట్ చేస్తుంటే, భారత్ నోట్లను కౌంట్ చేస్తోంది.
- ఛాయ్ తాగనీయకుండా దేశాన్ని నిద్రలేపుతున్న ఒకే ఒక్క చాయ్‌వాలా మోడీ మాత్రమే. (రూ.500, రూ.1000 నోట్లు బ్యాన్ చేయడంతో బుధవారం ఉదయం పాలప్యాకెట్లు కొనడం ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశ్యంతో ఆ కామెంట్ చేశారు.)
- అందరూ అమెరికా ఎన్నికల పరీక్షలకు సిద్ధమైతే, సిలబస్‌లో లేని మోడీ ప్రశ్న వచ్చింది. (మీడియాతో సహా అందరూ అమెరికా ఎన్నికల ఓటింగ్‌ను ఆసక్తిగా పరిశీలిస్తున్న సమయంలో మోడీ ప్రకటన రావడంపై..)

అమెరికా ఎన్నికలను బీట్ చేసిన మోడీ
మీడియా, భారత దేశ జనాభా అత్యంత ఆసక్తిగా అమెరికా ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకు పరిస్థితి అలాగే ఉంది. కానీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధాని మోడీ ప్రకటన చేసిన తర్వాత.. అమెరికా ఎన్నికలు ఎక్కడికో పోయాయి. మీడియా సహా జనాల దృష్టి ఒక్కసారిగా అమెరికా నుంచి మోడీ ప్రకటన వైపు మరలింది.












Click it and Unblock the Notifications