Student: ఉగ్రవాదులతో లింక్, యువకులకు శిక్షణ, మాజీ సీఎం ఇలాకాలో ఇంజనీరింగ్ విద్యార్థి ? !
బెంగళూరు/శివమొగ్గ: ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. కొంతకాలంగా ఇంజనీరింగ్ విద్యార్థి ప్రవర్తనలో తేడాలు వచ్చాయి. మ్యాటర్ పోలీసులకు వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న విద్యార్థి కాలేజ్ లో చదివే విద్యార్థులతో అంటీముట్టనట్లు ఉంటున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఐసిస్ తో లింక్ పెట్టుకుని యువకులకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నాడని వెలుగు చూడటం మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కలకలం రేపింది.

మాజీ సీఎం ఇలాకాలో ?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. శివమొగ్గలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో యాసిన్ అనే యువకుడు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి యాసిన్ ను పోలీసులు అరెస్టు చెయ్యడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

ఐసిస్ తో లింక్ !
ఇంజనీరింగ్ కాలేజ్ యాసిన్ ను అరెస్టు చేసిన పోలీసులు అతను ఇచ్చిన సమాచారంతో తీర్థహళ్ళి లోని సోప్పుగుడ్డ నివాసి షరీక్, మంగళూరుకు చెందిన మాజ్ అనే వ్యక్తులను మంగళవారం అరెస్టు చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి యాసిన్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐసిస్)తో నేరుగా లింక్ పెట్టుకున్నాడని, అందుకే అతన్ని అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు.

యువకులకు బ్రైన్ వాష్.... ఉగ్రవాద శిక్షణ ?
ఇంజనీరింగ్ విద్యార్థి యాసిన్ ముస్లీం మతానికి చెందిన కొందరు యువకులకు బ్రైన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నాడని, బాంబులు తయారు చెయ్యడం, బాంబ్ బ్లాస్ట్ చెయ్యడం తదితర విషయాల్లో శిక్షణ ఇస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. డీఎస్పీ బాలరాజ్ ఆయన సిబ్బందితో కలిసి పక్కా సమాచారంతో ఇంజనీరింగ్ విద్యార్థి యాసిన్ తో సహ ముగ్గురిని అరెస్టు చేశారు. మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో ఐసీస్ తో లింక్ పెట్టుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications