ఆన్సర్ షీట్ లో సినిమా డైలాగ్ .. ఫుల్ మార్క్స్ వేసిన టీచర్.. వీడియో వైరల్..
ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలోని నలుమూలల్లో జరిగే వింతలు, వినోదాలు మన వరకు చేరుతున్నాయి. కొన్ని ఆశ్చర్యంగానూ మరికొన్ని షాకింగ్ గానూ ఇంకొన్ని ఫన్నీ గా ఉంటాయి. వీటిని చూసినవాళ్లు మిగతా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కు షేర్ చేస్తుండటంతో ఇవి వైరల్ గా మారుతాయి.అలాంటి ఓ వైరల్ వీడియో మీకోసం.
పరీక్ష రాస్తున్నప్పుడు జవాబు గుర్తుకురాకపోతే ఏదో ఒకటి రాయడం మనకు అలవాటే. ఇంకొంతమంది సినిమా స్టోరీస్, డైలాగ్స్ రాసిన ఉదంతాలూ మనం చూశాం. అలాంటి ఓ సంఘటనే ఇది. ఇక్కడ ఓ విద్యార్థి తన ఆన్సర్ షీట్ లో ఓ సినిమా డైలాగ్ రాశాడు. ఇక టీచర్ సీరియస్ గా ఒక్కో విద్యార్థి ఆన్సర్ షీట్లు దిద్దుతూ వస్తున్నాడు.

సడెన్ గా ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ వద్ద టీచర్ పెన్ను ఆగింది. ఆ పేపర్ లో స్టూడెంట్ రాసిన డైలాగ్ చూసి టీచర్ షాక్ తిన్నాడు. ఈ కళాఖండాన్ని వీడియోలో భద్రపరచాలని భావించి పక్కనే ఉన్న వ్యక్తిని పిలిచి వీడియో తీయమని చెప్పాడు. ఆ డైలాగ్ ను కూడా రైట్ కొట్టి ఫుల్ మార్క్స్ వేశాడు. మార్కులు 80 కి గాను 80 వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Define Aura 🗿 pic.twitter.com/MHzKmXZKlX
— Prof cheems ॐ (@Prof_Cheems) February 7, 2025
ఇంతకీ ఆ ఆన్సర్ షీట్ లో స్టూడెంట్ రాసిన డైలాగ్ ఏంటి అని మీకు ఆత్రుతగా ఉందా..? ఆ కుర్రాడు.. "అందరూ నువ్వు ఫెయిల్ కావాలని ఎదురు చూస్తున్నప్పుడు.. విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరు కదా.." అని రాశాడు. అది చదివిన టీచర్ కు ఏమని అనిపించిందో తెలియదు గానీ ఫుల్ మార్క్స్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మంది వరకు చూశారు. స్టూడెంట్ సంతోషం కోసం టీచర్ ఇలా చేశారని, టీచర్ చాలా మంచివారని, ఆయన దయాహృదయం కలవారని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి..












Click it and Unblock the Notifications