Students: ఫేస్ బుక్ లో లుక్ చూపించి ?, సైకాలజీ చేసి శాడిస్టు ఏం చేశాడంటే ?
చెన్నై/మదురై: పీజీ చేసిన యువకుడు ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కువగా కాలం గడుపుతున్న యువకుడు కాలేజ్ అమ్మాయిలు, స్కూల్ లో చదువుతున్న అమ్మాయిలను పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో పరిచయం అయిన అమ్మాయిలకు దగ్గర అయిన యువకుడు వారితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. పరిస్థితులు తారుమారు కావడంతో కేటుగాడి చేతికి చిప్పకూడు వచ్చింది.
Lady:
వివాహిత
మహిళ
కిడ్నాప్,
గ్యాంగ్
రేప్,
ప్రైవేట్
పార్ట్
లో
ఇనుపరాడ్
చెక్కేసి
?
!

సైకాలజీ కోర్స్
తమిళనాడులోని మదురైలోని అయ్యంగార్ బంగ్లా ప్రాంతంలో చందూర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేసిన చందూర్ ఉద్యోగం చెయ్యకుండా గాలికి తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. ఉద్యోగం చెయ్యాలని కుటుంబ సభ్యులు చెప్పినా చందూర్ ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది.

అమ్మాయిలు టార్గెట్
సోషల్ మీడియాలో ఎక్కువగా కాలం గడుపుతున్న చందూర్ కాలేజ్ అమ్మాయిలు, స్కూల్ లో చదువుతున్న అమ్మాయిలను పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో పరిచయం అయిన అమ్మాయిలకు దగ్గర అయిన చందూర్ వారికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని వారితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీశాడు.

నగదు, నగలు లాక్కొని ఎంజాయ్
అమ్మాయిల పర్సనల్ వీడియోలు, ఫోటోలు తీసిన చందూర్ వారిని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. అమ్మాయిలను బెదిరించి వారి దగ్గర బంగారు నగలు, నగదు ఇప్పించుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన కొందరు అమ్మాయిలను బెదిరించాడు.

13 తులాల బంగారం
స్కూల్ లో చదువుతున్న అమ్మాయిని ఇలాగే బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ అమ్మాయి భయంతో ఇంట్లో ఉన్న 13 తులాల బంగారం చోరీ చేసి చందూర్ కు తెచ్చి ఇచ్చింది. ఆ బంగారం విక్రయించిన చందూర్ బైక్ తీసుకుని జల్సా చేశాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగడంతో చందూర్ మ్యాటర్ బయటకు వచ్చింది.

50 మంది అమ్మాయిలతో గేమ్స్
అమ్మాయిల పర్సనల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన చందూర్ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని పోలీసులు అన్నారు. ఇప్పటి వరకు చందూర్ 50 మందికి పైగా అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడాడని వెలుగు చూసిందని, కేసు విచారలో ఉందని మదురై పోలీసులు తెలిపారు.