హాహా.. సంతోషంగా ఉంది!: జూనియర్ ఇంజినీర్ పరీక్షలో టాపర్‌గా సన్నీలియోని
పాట్నా: బీహార్‌లో జూనియర్ ఇంజనీర్ పరీక్షలకు వచ్చిన దరాఖాస్తుల్లో సన్నీలియోని టాపర్‌గా (మెరిట్ లిస్ట్ ఆధారంగా) నిలిచింది. ఈ పేరుతో ఉన్నవారు టాపర్‌గా నిలవడంతో ఇది మీడియాలో వార్త అయింది. ఈ సన్నీలియోని బీహార్‌కు చెందిన ఓ విద్యార్థిని. ఆమె పరీక్షలు రాసి, టాపర్‌గా నిలిచింది.
ఇటీవల బీహార్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్(పీహెచ్‌ఈడీ) జూనియర్ ఇంజినీర్(సివిల్) పోస్ట్‌లకు నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 15 నుంచి 31 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరించింది. మొత్తం పదిహేడు వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నుంచి మెరిట్ లిస్ట్‌ను తయారు చేసి విడుదల చేసింది. ఇందులో టాపర్‌గా సన్నీలియోని పేరు ఉంది.

సన్నీలియోని పేరు మీద దరఖాస్తు ఇది
మెరిట్ జాబితా ప్రకారం సన్నీలియోని 98.5 శాతం పాయింట్లతో టాప్‌లో ఉంది. అగ్రస్థానంలో ఉంది. దీనిపై పీహెచ్‌ఈడీ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ.. సన్నీలియోని పేరు మీద జూనియర్ ఇంజినీర్ పోస్ట్‌కు దరఖాస్తు వచ్చిందని, ఆమె తండ్రి పేరు లియోనా లియోనిగా ఉందని, 1991 మే 13 ఆమె బర్త్ డేట్ ఉందని, ఇంజినీరింగ్ డిప్లొమాలో 98.5 శాతం పాయింట్లు వచ్చినట్లు పేర్కొన్నారని, ఇది నిజమైనదా కాదా అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేమని, సర్టిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత అన్నీ తెలుస్తాయని అన్నారు.
సన్నీలియోన్ స్పందన
కాగా, తన పేరు రావడంపై నటి సన్నీలియోన్ స్పందించింది. బీహార్ జూనియర్ ఇంజినీర్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో మీరు క్వాలిఫై అయ్యారని, ఈ వార్త మీరు చదివారా అని ఓ ట్విట్టరిటీ సన్నీలియోన్‌ను ప్రశ్నించగా ఆమె స్పందించింది. 'అందరి కంటే నేను బాగా స్కోర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను.. హాహా.. (చిరునవ్వు)' అంటూ ట్వీట్ చేశారు.

బీవీసీఎక్స్‌జెడ్బీఎన్ఎన్బీ.. దరఖాస్తులు అనుమానాస్పదం
ఇదిలా ఉండగా, ఇలాంటి పేర్లతో తప్పుడు దరఖాస్తులు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. టాపర్‌గా ఉన్న సన్నీలియోన్‌తో పాటు మూడో టాపర్‌గా ఉన్న దరఖాస్తుదారు పేరు బీవీసీఎక్స్‌జెడ్బీఎన్ఎన్బీ (bvcxzbnnb)గా ఉంది. ఈ పేరుతో 92.89 పాయింట్లు వచ్చినట్లుగా ఉంది. టాపా పదిహేను మంది జాబితాను విడుదల చేసింది. అందులో కొన్ని పేర్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. కొందరు కావాలనే తప్పుడు పత్రాలతో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications