సునీత కృష్ణన్ చెప్పిన పోర్న్ కింగ్‌పిన్ ఇతనే: బెంగళూర్‌లో చిక్కాడు
బెంగుళూరు: హైదరాబాదులోని నివసిస్తున్న సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ఆ మధ్య షేమ్ ద రేపిస్ట్ అంటూ వారిని పట్టుకోవాలంటూ సోషల్ మీడియాలో కోరిన విషయం తెలిసే ఉంటుంది. ఇంటర్నెట్, వాట్సప్‌ల్లో అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్న విషయాన్ని కనిపెట్టాలని ఆమె ఆ విజ్ఞప్తి చేశారు. ఆమె చెప్పిన దుర్మార్గుల్లో ఉన్న వ్యక్తినే బెంగళూర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్‌నెట్‌లోనూ, వాట్సప్‌లోనూ అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్న కౌశిక్ సత్యపాల్ అనే యువకుడిని బెంగుళూరు పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సునీత కృష్ణన్ చెప్పింది ఇతని గురించే.
కౌశిక్ వద్ద కనీసం 300 పైగా అశ్లీల చిత్రాలు, రేప్‌లకు సంబంధించిన పలు వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అత్యంత భయంకరమైన, జుగుప్సాకరమైన వీడియోలను, అశ్లీల చిత్రాలనూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సర్కులేట్ చేస్తుంటే సభ్యసమాజం ఏం చేస్తోందని సునీత కృష్ణన్ అప్పట్లో ప్రశ్నించారు. సెల్ ఫోన్‌లను దుర్వినియోగం చేస్తున్న ఇటువంటి వారిని పట్టుకోవాలని సునీత సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అనంతరం సుప్రీం కోర్టు ఇటువంటి ఆక్షేపణీయమైన, అశ్లీలమైన చిత్రాలను, వీడియోలనూ సర్కులేట్ చేస్తున్న వ్యక్తులను పట్టుకోవాలని సిబిఐని ఆదేశించింది. ఇన్నాళ్లకు ఆ వ్యక్తి పోలీసులకు దొరికాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కౌశిక్ రెండేళ్లుగా బెంగుళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే వాటిని వీడియో తీసి సెల్ ఫోన్‌లలో అందరికీ పంపడం అత్యంత తీవ్రమైన అంశంగా పేర్కొంటూ సునీత ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిబిఐ పోలీసులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వీడియో ఎక్కడెక్కడనుంచి ఎలా సర్కులేట్ అయిందో గుర్తించి, అతన్ని పట్టుకున్నారు.
కౌశిక్ సత్యపాల్ కునార్ అశ్లీల చిత్రాలను చిత్రీకరించేందుకు స్టెల్త్ కెమెరాలు, ఆ చిత్రాలను ఎడిట్ చేసేందుకు హై ఎండ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి బ్లూ ఫిలింలు రికార్డు చేసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసేవాడని సీబీఐ అధికారులు అంటున్నారు.

నిందితుడి నుండి 9 అత్యాచారాలు చేస్తున్న క్లిప్పింగ్ లు, 500 బ్లూ ఫిలింలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో అనేక మంది ఉన్నారని సీబీఐ అధికారులు అంటున్నారు. 2013 నుండి కౌశిక్ బెంగళూరులో ఉంటున్నాడు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications