Super Star: టాప్ హీరోకు ఏనుగు దంతాల కేసులో షాక్, విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, ఐటీ శాఖ వదిలేసినా !
తిరువనంతపురం/కేరళ: విలక్షణ నటుడు, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కోర్టులో చుక్కెదురైయ్యింది. అక్రమంగా ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకున్నారని నమోదు అయిన కేసులో సూపర్ స్టార్ మోహన్ లాల్ కేసు విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది. తన మీద నమోదు అయిన అక్రమ ఏనుగు దంతాల కేసు విచారణ నిలిపివేయాలని నటుడు మోహన్ లాల్ కోర్టుకు మనవి చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలు పెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించారని అటవి శాఖ అధికారులు నటుడు మోహన్ లాల్ మీద కేసు నమోదు చేశారు. థర్డ్ పార్టీ జోక్యం తగదని గతంలో ట్రయల్ కోర్టు ఈ కేసు విచారణను తోసిపుచ్చింది. అయితే ఇద్దరు వ్యక్తులు ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు దాఖలు చెయ్యడంతో కేరళ హైకోర్టు వీరి వాదనలు వినడానికి అనుమతి ఇచ్చింది. కేరళ హైకోర్టు ఆదేశాలతో నటుడు మోహన్ లాల్ కు మళ్లీ ఏనుగు దంతాల కేసు టెన్షన్ మొదలైయ్యింది. ఎవరైనా అక్రమసంగా ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకున్నారని కోర్టు విచారణలో వెలుగు చూస్తే మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్షపడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

ఐటీ శాఖ దాడులతో షాక్
కొంతకాలం క్రితం ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో సోదాలు చేశారు. ఆ సమయంలో మోహన్ లాల్ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు రెండు ఏనుగు దంతాలు గుర్తించారు. అయితే ఆ సమయంలో ఐటీ శాఖ అధికారులు మాత్రం మోహన్ లాల్ మీద కేసులు నమోదు చెయ్యలేదని తెలిసింది.

అటవి శాఖ అధికారుల ఎంట్రీ
ఐటీ శాఖ అధికారులు వదిలేసినా కేరళ అటవి శాఖ అధికారులు మాత్రం సూపర్ స్టార్ మోహన్ లాల్ మీద పంజా విసిరారు. అక్రమంగా ఏనుగు దంతాలు పెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించారని అటవి శాఖ అధికారులు నటుడు మోహన్ లాల్ మీద కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు సామాజిక కార్యకర్తులు జేమ్స్ మ్యాథ్యూ, ఏఏ పౌలోస్ కలిసి ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకున్న మోహన్ లాల్ మీద చర్యలు తీసుకోవాలని కోర్టులో మనవి చేశారు.

హైకోర్టులో పిటీషన్
తన మీద నమోదు అయిన అక్రమ ఏనుగు దంతాల కేసు విచారణ నిలిపివేయాలని మోహన్ లాల్ కోర్టుకు మనవి చేశారు. ఇదే సమయంలో అక్రమ ఏనుగు దంతాల నిల్వ కేసులో థర్డ్ పార్టీ జోక్యం తగదని గతంలో ట్రయల్ కోర్టు ఈ కేసు విచారణను తోసిపుచ్చింది. అయితే ఇద్దరు వ్యక్తులు కేరళ హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. కేరళ హైకోర్టు వీరి వాదనలు వినడానికి అనుమతి ఇచ్చింది.

మోహన్ లాల్ కు టెన్షన్
కేరళ హైకోర్టు ఆదేశాలతో నటుడు మోహన్ లాల్ కు మళ్లీ ఏనుగు దంతాల కేసు టెన్షన్ మొదలైయ్యింది. ఎవరైనా అక్రమంగా ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకున్నారని కోర్టు విచారణలో వెలుగు చూస్తే మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్షపడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications