దుమ్ములేపుతున్న రజనీకాంత్, కర్ణాటకలో రికార్డు బ్రేక్, కలెక్షన్లు హామ్ ఫట్ !
బెంగళూరు/చెన్నై: ఇండియా మొత్తం ఇప్పుడు హడావిడి, ఎక్కువ సందడి చేస్తున్న ఒకేఒక్క సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా. గతంలో ఓ సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన దర్శకుడు నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.
రజనీకాంత్ గత చిత్రంతో పరాజయం పొందిన తరువాత డీలా పడిపోయారు. జైలర్ సినిమా స్టోరీతో ఆయన కొడుకు, పోలీసు అధికారి, అతను దర్యాప్తులో వెనుకబడి, అకస్మాత్తుగా తప్పిపోతాడు. ఇదిపాత సినిమా కథే. ఈ కథ సినిమా సాదాసీదాగా అనిపించినా నేటి సినీ ప్రియులకు నచ్చే విధంగా స్క్రీన్‌ప్లే అల్లిన దర్శకుడు నెల్సన్ కుమార్ సినీ ప్రియుల హృదయాలను గెలుచుకోగలిగాడు.

దేశంలో జైలర్ సినిమా వసూళ్లలో తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. అయితే తమిళనాడు తరువాత అత్యధిక కలెక్షలు సాధించడంలో కర్ణాటక రికార్డు బ్రేక్ సాదించింది. జైలర్ కర్ణాటక బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ పొందింది. జైలర్ సినిమా విడుదల అయిన మొదటి 5 రోజుల్లో రూ. 36. 05 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఈ సంవత్సరం, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన క్రాంతి తర్వాత కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన ఒకేఒక్క చిత్రంగా జైలర్ సినిమా నిలిచింది. జైలర్ కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను వెంకట్ మీడియా రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. జైలర్ 5 రోజుల తర్వాత కర్ణాటక బాక్సాఫీస్ వద్ద 18. 7 కోట్ల షేర్ వసూలు చేసింది.

దీని ద్వారా ఇప్పటికే రూ. 8 కోట్లకు పైగా రాబట్టిన జైలర్ సినిమా ఆగస్టు 15వ తేదీన మంచి లాభాలు గడించింది. నిన్న మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా సెలవు కావడంతో బెంగళూరు, మైసూర్ సహా కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు రాబట్టిన జైలర్ల సినిమా ఇతర బాషల సినిమాలకు సవాలు విసిరింది. ఇప్పటికే కర్ణాటకలో రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు చేసిన జైలర్ సినిమా ఇంకా ఎన్ని రికార్డులకు తెర లేపుతుందో వేచి చూడాలని అంటున్నారు సినీ ప్రేక్షకులు












Click it and Unblock the Notifications