Supreme Court: అలా చేస్తే నేరం కాదు.. వివాహేతర సంబంధాలపై సుప్రీం తీర్పు..!
పెళ్లైనా మరొకరితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే తప్పు కాదని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది. వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లైన తర్వాత భార్య అయినా, భర్త అయినా మరొకరితో ఇష్టంగా శృంగారంలో పాల్గొంటే నేరం కాదని పేర్కొంది. చాలా కాలం పాటు సహజీవనం చేసి, శృంగారంలో పాల్గొని విభేదాల కారణంగావిడిపోయిన తర్వాత పురుషులపై అత్యాచారం కేసు పెట్టడం సరైంది కాదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం అభిప్రాయపడింది.
పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే శారీరక సంబంధం పెట్టుకుంటారని కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. ముంబైలోనే ఖర్గార్ స్టేషన్ లో ఏడేళ్ల క్రితం ఓ వివాహితుడిపై విడో పెట్టిన రేప్ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. విడో వేసిన పిటిషన్ సుప్రీం కొట్టివేసింది. మైనర్ గా ఉన్న అమ్మాయి ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే అది నేరంగా పరిగణిస్తున్నారు. దాని రేపు కేసుగా నమోదు చేయవచ్చు. మైనర్ బాలికతో శృంగారం జరపడం అత్యాచారం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది.

ఆమె సొంత భార్యే అయినా, ఇష్టంతో శృంగారంలో పాల్గొన్నా నేరమేనని స్పష్టం చేసింది. 18 ఏళ్లు నిండని బాలికతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరమని తేల్చి చెప్పింది. అయితే పెళ్లై, భార్య 18 సంవత్సరాలు దాటినా తర్వాత ఆమె ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొనడం నేరంగా పరిగణించాలని డిమాండ్ ఉంది. అలాగే అత్యాచార బాధితురాలి పేరు, ఫొటో, వీడియోను బహిరంగ పరుచ్చొద్దని సుప్రీం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications