పోర్న్ వీడియోలపై సుప్రీం: ఆన్‌లైన్ పోర్టల్, హాట్‌లైన్ ఏర్పాటుకు ఆదేశం..
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవుతున్న అశ్లీల వీడియోలను సుప్రీం తీవ్రంగా పరిగణిస్తోంది. వాటికి వ్యతిరేకంగా చేసే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఓ ఆన్‌లైన్ పోర్టల్, హాట్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా న్యా
న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవుతున్న అశ్లీల వీడియోలను సుప్రీం తీవ్రంగా పరిగణిస్తోంది. వాటికి వ్యతిరేకంగా చేసే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఓ ఆన్‌లైన్ పోర్టల్, హాట్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ యు యు లలిత్‌లతో కూడిన సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలకు సంబంధించి గతంలో కోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ సమర్పించిన పలు ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకొని కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

కమిటీ ప్రతిపాదనలను వీలైనంత త్వరగా అమలులోకి తీసుకురావాల్సిందిగా కోరింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ, ఫేస్‌బుక్ సంస్థలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కలిసి ఈ నివేదికను రూపొందించారు. ఈ కమిటీకి సమాచార, ప్రచారశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారు.
కమిటీ రూపొందించిన మొత్తం 11 ప్రతిపాదనలను న్యాయస్థానం ముందుంచారు. కాగా, కమిటీ నివేదిక మేరకు ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా కొన్ని 'కీ' వర్డ్స్ సేకరించనున్నాయి. ఆపై వాటిని బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంటారు. అశ్లీల వీడియోలు ఆన్‌లైన్‌లో అప్ లోడ్ కాకుండా ఉండేందుకు అవసరమైతే సీబీఐ సహాయం కూడా తీసుకోవాల్సిందిగా న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం. '
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications