జస్టిస్ నారిమన్ రిటైర్మెంట్- సుప్రీంలో మిగిలిన 25 జడ్డీలు-నియామకాల ప్రతిష్టంభన వేళ

దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకాలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ మరో జడ్జి ఇవాళ రిటైర్ అవుతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారిమన్ ఇవాళ రిటైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల్లో రెండు సీనియర్ జడ్జి ఆయన. దీంతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య మరింత తగ్గబోతోంది.

సుప్రీంకోర్టులో మొత్తం 34 న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం రోహింగ్టన్ ఫాలీ నారిమన్ రిటైర్మెంట్ తో ఆ సంఖ్య 25కు పడిపోతోంది. ఈ దశలో ఈ నెల 19న మరో న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా కూడా రిటైర్ కాబోతున్నారు. దీంతో ఈ సంఖ్యచ 24కు పడిపోతుంది. దీంతో సుప్రీంకోర్టు ఏకంగా 10 మంది జడ్జీల నియామకాలు చేపట్టాల్సి ఉంది. కానీ 22 నెలలుగా సుప్రీంకోర్టు కొలీజియం ఎలాంటి నియామకాలు చేపట్టడం లేదు. చివరిగా 2019 సెప్టెంబర్ లో చివరి న్యాయమూర్తి సుప్రీంకోర్టులో నియామకం అయ్యారు. దీంతో పెండింగ్ కేసుల ఒత్తిడి నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు కొలీజియం ఈ దిశగా కదులుతుందా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది.

Justice Rohinton Fali Nariman retires today, focus back on appointments deadlock

ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీలుగా నియామకాలు జరిపే లిస్టులో కర్నాటక హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అభయ్ ఓకా సీనియార్టీలో తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాత త్రిపుర హైకోర్టు సీజే అకిల్ ఖురేషీ ఉన్నారు. వీరితో పాటు సీనియార్టీ జాబితాలో ఉన్న మరికొందరు న్యాయమూర్తుల్ని కొలీజియం సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు పరిశీలించాల్సి ఉంది.

అయితే దీనికోసం కొలీజియం ఎప్పుడు భేటీ కానుందనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. మరోవైపు ఇవాళ రిటైర్ అవుతున్న జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారిమన్ స్ధానంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు కొలీజియంలో చేరబోతున్నారు. ప్రస్తుతం సుప్రీం కొలీజియంలో సీజేఐ రమణతో పాటు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. వీరితో పాటు లావు నాగేశ్వరరావు కూడా చేరితే కొలీజియంలో ఇద్దరు తెలుగు న్యాయమూర్తులు ఉన్నట్లవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+