Unnao Rape Case: ఉన్నావ్ రేప్ కామాంధుడికి సుప్రీం బిగ్ షాక్..! కీలక ఆదేశాలు..!
ఉత్తర్ ప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపుతున్న ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా తేలిన మాజీ బీజేపీ నేత కుల్దీప్ సెంగార్ కు సుప్రీంకోర్టు ఇావాళ భారీ షాకిచ్చింది. ఈ రేప్ కేసులో దోషిగా తేలిన తర్వాత జైల్లో శిక్ష అనుభవిస్తున్న సెంగార్ కు తాజాగా ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతే కాదు తదుపరి శిక్షను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలకు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కీలక మలుపునిచ్చాయి.

2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో మాజీ బీజేపీ ఎమ్మెల్యే అయిన కుల్దీప్ సెంగార్ కు జీవిత ఖైదు పడింది. దీంతో ఆయన అప్పటి నుంచీ జైలు జీవితం గడుపుతున్నారు. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టులో ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు మిగిలిన జైలు శిక్షను రద్దు చేయాలని కోరారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆయన కోరిక మన్నించి బెయిల్ ఇవ్వడంతో పాటు మిగిలిన జైలుశిక్ష రద్దు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.
బాధితురాలు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. ఆమెతో పాటు ఆందోళనకు దిగిన తల్లి, సామాజిక కార్యకర్తను కూడా పోలీసులు బలవంతగా అక్కడి నుంచి తరలించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బాధితురాలుతో పాటు సీబీఐ కూడా కుల్దీప్ సెంగార్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ సెంగార్ బెయిల్ రద్దు చేసింది. దీంతో పాటు మిగిలిన శిక్ష రద్దుపై వివరణ ఇవ్వాలని నోటీసులు కూడా జారీ చేసింది. స్పందించడానికి సెంగర్‌కు నాలుగు వారాల సమయం ఇచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛపై రాజీ పడే ప్రశ్నే లేదని సుప్రీంకోర్టు ఈ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మహిళ తండ్రి కస్టడీలో మరణించిన కేసులో ఏకకాలంలో శిక్ష అనుభవిస్తున్న సెంగార్ ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications