మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు - హానికరం కాదు: రాజా సింగ్ విషయంలో..!!
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయాలంటూ దాఖలైన పిటీషన్లను తోసిపుచ్చింది. వాటిపై విచారణ చేపట్టడానికి నిరాకరించింది. ఈ వ్యాఖ్యల అనంతరం దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి వెల్లువెత్తిన ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఇప్పటికే నుపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఓ టెలివిజన్‌లో డిబేట్ సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పలు ముస్లిం దేశాలు సైతం అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయా. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబారులకు సమన్లు జారీ చేశాయి. వారిని పిలిపించుకుని సంతృప్తికర వివరణను తీసుకున్నాయి. తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఆయా ముస్లిం దేశాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు సైతం రాశాయి. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించట్లేదు.

ఆమెను అరెస్ట్ చేయాలంటూ దాఖలైన పిటీషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఆ పిటీషన్‌ను తోసిపుచ్చింది. విచారించట్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడించింది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు హానికరం కాదని జస్టిస్ యూయూ లలిత్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై చెలరేగిన వివాదం తీవ్ర స్థాయికి చేరిందనీ పేర్కొన్నారు.
ఈ పిటీషన్‌ను బెంచ్ విచారణకు స్వీకరించట్లేదని, దాన్ని వెనక్కి తీసుకోవాలని కక్షిదారుడికి సూచించింది బెంచ్. వెనక్కి తీసుకోకపోతే తామే దాన్ని సస్పెండ్ చేస్తామని సీజేఐ యూయూ లలిత్ స్పష్టం చేశారు. అంతకుముందు- ఇదే విషయంలో బీజేపీ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఆమెను పార్టీ నుంచి సస్పెడ్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటిక దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిందని గుర్తు చేసింది.
కాగా- నుపుర్ శర్మ అరెస్ట్ కోసం దాఖలైన పిటీషన్లింటినీ సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదలాయించింది. ఆమె తరమాలోనే బీజేపీకి చెందిన గోషామహల్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్‌సైతం విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు ఆయనై ప్రీవెన్షన్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. రాజా సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తతం ఆయన చర్లపల్లి సంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications