టీపై వెనక్కి వెళ్లం: జగన్‌కు తేల్చి చెప్పిన సురవరం

Ys jagan and Suravaram Sudhakar Reddy
న్యూఢిల్లీ: సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు నిరాశే ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తాము తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని సురవరం సుధాకర్ రెడ్డి జగన్‌కు తేల్చి చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి ఢిల్లీ చేరుకున్న జగన్ శనివారం సురవరం సుధాకర్ రెడ్డిని కలిశారు.

సురవరం సుధాకర్ రెడ్డికి ఆయన ఐదు పేజీల లేఖను అందించారు. దాదాపు 45 నిమిషాల పాటు జగన్ సురవరంతో సమావేశమయ్యారు. సమావేశానంతరం సురవరం సుధాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని జగన్ తమను కోరినట్లు ఆయన తెలిపారు. ఆర్టికల్ 3ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని జగన్ చెప్పారని, అయితే, అది దుర్వినియోగం కాకుండా తాము చూస్తామని చెప్పామని ఆయన అన్నారు.

తమ నిర్ణయంలో పునరాలోచన లేదని, విభజన జరగాల్సిందేనని తాము జగన్‌తో చెప్పినట్లు ఆయన తెలిపారు. విభజించు, పాలించు సూక్తికి ఆంధ్రప్రదేశ్ నాంది కాకూడదని, రాష్ట్రాన్ని విభజిస్తే దేశం ముక్కలవుతుందని జగన్ అన్నారని ఆయన చెప్పారు. అయితే, రాష్ట్రాన్ని విభజించడానికి ఇష్టం లేనివారే దేశం ముక్కలవుతుందనే వాదనను ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు విడిపోదలుచుకున్నప్పుడు దాన్ని ఆపాల్సిన అవసరం లేదని, సుదీర్ఘ ఉద్యమాల తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.

సీమాంధ్రకు న్యాయం చేసిన తర్వాతనే రాష్ట్రాన్ని విభజించాలనే వాదనను కూడా సురవరం కొట్టిపారేశారు. రాష్ట్ర విభజన వేగంగా జరగాలని, విభజన ప్రక్రియతో పాటు సీమాంధ్రకు న్యాయం చేసే ప్రక్రియ జరగాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు దేశమంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సీమాంధ్రకు న్యాయం జరగేలా తాము చూస్తామని జగన్‌తో చెప్పినట్లు ఆయన తెలిపారు. పలు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ముక్కలు కాని దేశం తెలంగాణ ఏర్పిడినప్పుడే అవుతుందా ఆయన సురవరం ప్రశ్నించారు. జగన్‌తో పొత్తులపై చర్చ జరగలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+