Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Solar Eclipse 2022: సూర్యగ్రహణ అద్భుత దృశ్యాలు, ప్రారంభం-ముగింపు ఇలా

న్యూఢిల్లీ: సూర్యగ్రహణం మంగళవారం సాయంత్రం ఏర్పడింది. ఈ సంవత్సరంలో ఇది రెండోది. ఇదివరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తొలి సూర్యగ్రహణం సంభవించింది. ఈ సంవత్సరం మొత్తంగా నాలుగు గ్రహణాలు ఏర్పడబోతోన్నాయి. సూర్య, చంద్ర గ్రహణాలు రెండు చొప్పున రానున్నాయి. ఈ అమావాస్యకు సంభవించే సూర్యగ్రహణంతో దాని కోటా పూర్తవుతుంది. ఈ ఏడాది నవంబర్‌ 7,8 తేదీల్లో చంద్రగ్రహణం రాబోతోంది. దీపావళి అమావాస్య నాడు రానున్నందున ఈ సూర్యగ్రహణానికి హిందూ పంచాంగం ప్రకారం ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. దీపావళి నాడు చేసే లక్ష్మీపూజను ఒకరోజు ముందే జరుపుకొన్నారు భక్తులు.

Surya Grahan 2022: Here is the live updates of Solar eclipse, find out the cities that will witness

గ్రహణం నాడు దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడ్డాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఆలయం మాత్రం దీనికి మినహాయింపు. భారత్‌లో సూర్యగ్రహణం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైంది. 5:42 నిమిషాలకు సూర్యాస్తమయంతో పాటే ముగిసింది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమాసియా, నార్త్ అట్లాంటిక్ సముద్ర తీరం, హిందూ మహాసముద్రం ఉత్తర ప్రాంతంలో నివసించే ప్రజలు పాక్షికంగా ఈ సూర్యగ్రహణాన్ని తిలకించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మినిట్ టు మినిట్ మీ కోసం..

Oct 25, 2022, 7:03 pm IST

ముగిసిన సూర్య గ్రహణం.
Oct 25, 2022, 6:59 pm IST

మనదేశంలో నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు సూర్య గ్రహణం కొనసాగింది.
Oct 25, 2022, 6:56 pm IST

పుణెలో సూర్య గ్రహణ దృశ్యాలు.
Oct 25, 2022, 6:56 pm IST

బెంగళూరులో సూర్య గ్రహణ దృశ్యాలు.
Oct 25, 2022, 6:47 pm IST

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో సూర్య గ్రహణ దృశ్యాలు.
Oct 25, 2022, 6:31 pm IST

గుర్గావ్‌లో సూర్య గ్రహణ దృశ్యాలు.
Oct 25, 2022, 6:28 pm IST

ఇంగ్లాండ్‌లో సూర్య గ్రహణ దృశ్యాలు.
Oct 25, 2022, 6:07 pm IST

శ్రీనగర్‌లో సూర్య గ్రహణ దృశ్యం.
Oct 25, 2022, 5:59 pm IST

ఒడిశాలోని భువనేశ్వర్‌లో పాక్షిక సూర్య గ్రహణ దృశ్యం.
Oct 25, 2022, 5:57 pm IST

వారణాసిలో సూర్యగ్రహణ దృశ్యం. కాశీ విశ్వనాథుడి ఆలయం మూసివేసి ఉంచారు.
Oct 25, 2022, 5:56 pm IST

మహారాష్ట్రలో సూర్య గ్రహణ దృశ్యాలు.
Oct 25, 2022, 5:55 pm IST

మంగళవారం సాయంత్రం సూర్య గ్రహణం.
Oct 25, 2022, 5:53 pm IST

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో సూర్యగ్రహణ దృశ్యాలు.
Oct 25, 2022, 5:28 pm IST

దేశ రాజధాని న్యూఢిల్లీలో సూర్య గ్రహణ దృశ్యాలు.
Oct 25, 2022, 5:24 pm IST

నార్వేలో సూర్య గ్రహణ దృశ్యాలు.
Oct 25, 2022, 5:23 pm IST

ఉత్తర కాశ్మీర్‌లో సూర్య గ్రహణ దృశ్యం.
Oct 25, 2022, 5:22 pm IST

జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతంలో సూర్య గ్రహణం ఇలా.
Oct 25, 2022, 5:09 pm IST

మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాక్షిక సూర్య గ్రహణం.
Oct 25, 2022, 5:09 pm IST

మంగళవారం సాయంత్రం సూర్య గ్రహణం ఇలా.
Oct 25, 2022, 5:08 pm IST

దేశంలో పలు ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తోంది.
Oct 25, 2022, 5:07 pm IST

పాక్షిక సూర్య గ్రహణ చిత్రం.
Oct 25, 2022, 4:51 pm IST

పాక్షికంగా ఏర్పడుతున్న సూర్యగ్రహణ దృశ్యాలు.
Oct 25, 2022, 4:43 pm IST

అబూదాబిలో సూర్యగ్రహణం ఇలా.
Oct 25, 2022, 4:33 pm IST

సూర్య గ్రహణం సందర్బంగా పవిత్ర నదీ స్నానాలు చేస్తున్న ప్రజలు. సూర్య గ్రహణం కారణంగా పలు ఆలయాలు మూసివేశారు.
Oct 25, 2022, 3:04 pm IST

జమ్ములో సాయంత్రం 4.15 గంటలకు ప్రారంభం కానున్న సూర్య గ్రహణం
Oct 25, 2022, 3:02 pm IST

ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణానికి సంబంధించిన ఇమేజెస్
Oct 25, 2022, 3:01 pm IST

యుకేలో పాక్షిక సూర్య గ్రహణం
Oct 25, 2022, 2:49 pm IST

సోలార్ ఎక్‌లిప్స్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన నెటిజన్
Oct 25, 2022, 2:46 pm IST

ఖతర్‌లో సూర్యగ్రహణానికి సంబంధించిన పోటో
Oct 25, 2022, 2:45 pm IST

వాట్సాప్ గురించి సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+