సస్పెన్స్‌కు తెర:కర్నాటక కొత్త సీఎం సిద్ధరామయ్య..ఎంతవరకంటే..?

ఢిల్లీ: కర్నాటకీయంపై చర్చోపచర్చలు, సుదీర్ఘ మంతనాల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన వెల్లడైంది.కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఎంపీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అంతేకాదు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉంటారని ఆయన వెల్లడించారు. కర్నాటకకు డీకే శివకుమార్ మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది.

 Karnataka New CM-Siddharamaiah

దీంతో ఇప్పటి వరకు కర్నాటక సీఎం ఎవరనేదానిపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. సిద్ధ రామయ్య సీఎంగా శనివారం ప్రమాణస్వీకారం చేస్తారని రణదీప్ సూర్జేవాల చెప్పారు.అయితే సిద్ధరామయ్య రెండేళ్లు సీఎంగా కొనసాగుతారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. అదే సమయంలో కర్నాటక పీసీసీ చీఫ్‌గా డీకే శివకుమార్ కొనసాగుతారని కాంగ్రెస్ హైకమాండ్ వెల్లడించింది.

 Karnataka New CM-Siddharamaiah

అంతకుముందు కర్నాటక సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగింది. హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపగా... డీకే శివకుమార్ కాస్త అలగబూనినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జోక్యం చేసుకోవడంతో డీకే శివకుమార్ వెనక్కు తగ్గారు. రెండేళ్ల తర్వాత డీకే శివకుమార్‌కు సీఎంగా ఛాన్స్ ఇస్తామని చెప్పడంతో డీకేశీ తప్పని పరిస్థితుల్లో తగ్గాల్సి వచ్చింది. సిద్ధరామయ్య కేబినెట్‌లో డీకేశీ వర్గం మంత్రులుగా ఉంటారని సమాచారం.ఇక మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఒకే కారులో కలిసి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+