Suspicious: నేను నైట్ డ్యూటీ చేస్తుంటే ఇంట్లో నా భార్య ?, బెడ్ మీద శవమైన భార్య !

చెన్నై/సేలం: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. భర్త సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చిన జీతంతో భార్య, కూతురిని చాలా సంతోషంగా చూసుకుంటున్న భర్త ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్న భర్త డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ల్లో ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి భర్త ఉద్యోగానికి వెళ్లాడు. రాత్రి భార్య, కూతురు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఉదయం కూతురు గట్టిగా కేకలు వేస్తూ ఆర్తనాదాలు చేసింది. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూడగా మహిళ దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

తమిళనాడులోని సేలంలోని శీలనాయకన్ పట్టిలోని వేల్ నగర్ లో రాజశేఖరన్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 13 సంవత్సరాల క్రితం కార్తీకా సెల్వి అలియాస్ కార్తీకా (35) అనే మహిళను రాజశేఖరన్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాజశేఖరన్, కార్తీకా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

 భార్య, కూతురితో చాలా హ్యాపీ

భార్య, కూతురితో చాలా హ్యాపీ

రాజశేఖరన్, కార్తీకా దంపతులకు శక్తీ (10) అనే కుమార్తె ఉంది. రాజశేఖరన్ సేలంలోని ఓ కంపెనీలో చాలా సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చిన జీతంతో భార్య కార్తీకా, కూతురు శక్తిని చాలా సంతోషంగా చూసుకుంటున్న రాజశేఖరన్ ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు.

 పగలు, రాత్రి భర్తకు ఉద్యోగం

పగలు, రాత్రి భర్తకు ఉద్యోగం

సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్న రాజేశేఖరన్ డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ల్లో ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి రాజశేఖరన్ ఇంటికి వెళ్లి భార్య కార్తీకా, కూతురు శక్తీతో కలిసి భోజనం చేశాడు. తరువాత నైట్ డ్యూటీ ఉందని రాజశేఖరన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రి ఇంట్లో కార్తీకా, ఆమె కూతురు శక్తీ మాత్రమే ఉన్నారు.

 తల్లి శవాన్ని చూసి కూతురు ?

తల్లి శవాన్ని చూసి కూతురు ?

ఉదయం నిద్రలేచిన రాజశేఖరన్ కూతురు శక్తీ ఆమె తల్లి కార్తీ శవం అయ్యి కనిపించడంతో గట్టిగా కేకలు వేస్తూ ఆర్తనాదాలు చేసింది. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూడగా కార్తీకా దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. కార్తీకా భర్త రాజశేఖరన్ కూడా కనపడటం లేదని పోలీసులు అంటున్నారు.

 నేను నైట్ డ్యూటీ చేస్తుంటే నా భార్య ?

నేను నైట్ డ్యూటీ చేస్తుంటే నా భార్య ?

కార్తీకాను ఆమె భర్త రాజశేఖరన్ హత్య చేశాడా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కొంతకాలంగా భార్య కార్తీకా తీరుపై రాజశేఖరన్ అనుమానం పెంచుకున్నాడని, నైట్ డ్యూటీ చెయ్యడానికి నేను బయటకు వెళితే తన ఇంటికి ఓ వ్యక్తి వచ్చి వెలుతున్నాడని అతనికి అనుమానం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+