Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Swamiji: పోలీసు కస్టడీకి స్వామీజీ, ఎవరిని అడిగి ఆసుపత్రిలో చేర్పించారు ?, నీళ్లు నమిలిన పోలీసులు, దెబ్బకు !

బెంగళూరు/చిత్రదుర్గ: అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్వామీజీని పోలీసు కస్టడీకి ఇచ్చిన కోర్టు విచారణ పూర్తి అయిన తరువాత కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు పోలీసుల మీద న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. స్వామీజీని మా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మనవి చేశారు. నిందితుడు ఎక్కడ అని కోర్టు ప్రశ్నించింది. స్వామీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని న్యాయమూర్తికి పోలీసులు చెప్పారు. ఎవరిని అడిగి ఆసుపత్రికి తరలించారు ?, అంతా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారా ?, వెంటనే నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు,

 ఆసుపత్రిలో స్వామీజీ

ఆసుపత్రిలో స్వామీజీ

అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రదుర్గాకు చెందిన డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు అరెస్టు అయిన విషయం తెలిసిందే. స్వామీజీని చిత్రదుర్గా జిల్లా జైలుకు తరలించిన కొన్ని గంటల్లోనే స్వామీజీకి ఛాతి నొప్పి రావడంతో ఆయన్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

బెంగళూరుకు తరలించాలని ?

బెంగళూరుకు తరలించాలని ?

మఠాధిపతి శివమూర్తి మురగాకు ఛాతీ నొప్పి రావడంతో మొదట ఈసీజీ తీశామని, వైద్యపరీక్ష్లలు చేస్తున్నామని చిత్రదుర్గా జిల్లా ఆసుపత్రి వైద్యులు అన్నారు, స్వామీజీని బెంగళూరులోని జయదేవ ఆసుపత్రికి తరలించారని అక్కడి వైద్యులు పోలీసులకు సూచించారు. స్వామీజీని బెంగళూరుకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైయ్యింది.

కోర్టు ముందు పోలీసులు ఏం చెప్పారంటే ?

కోర్టు ముందు పోలీసులు ఏం చెప్పారంటే ?


శివమూర్తి మురుగా శరణరు స్వామీజీని మా కస్టడీకి ఇవ్వాలని శుక్రవారం పోలీసులు చిత్రదుర్గా జిల్లా కోర్టులో మనవి చేశారు. నిందితుడు ఎక్కడ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. శివమూర్తి మురుగా శరణరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని న్యాయమూర్తికి చిత్రదుర్గా పోలీసులు చెప్పారు.

మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారా ?

మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారా ?

ఎవరిని అడిగి ఆసుపత్రికి తరలించారు ?, అంతా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారా ?, వెంటనే నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు, అంతకు ముందు పోలీసుల మీద చిత్రదుర్గా జిల్లా కోర్టు న్యాయమూర్తి పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

 పోలీసు కస్టడీకి స్వామీజీ

పోలీసు కస్టడీకి స్వామీజీ

అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరును సెప్టెంబర్ 5వ తేదీ వరకు పోలీసు కస్టడీకి ఇవ్వడానికి న్యాయమూర్తి అంగీకరించారు.

 బెంగళూరులో చికిత్సకు ఓకే

బెంగళూరులో చికిత్సకు ఓకే


స్వామీజీని విచారణ చెయ్యడానికి మా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మనవి చెయ్యడంతో అందకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ దెబ్బతో శివమూర్తి మురుగా శరణరుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్వామీజీని బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స అందించడానికి న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+