స్వాతిని ఎఫ్‌బీలో చూసి ప్రేమించా! ‘కొండముచ్చు’ అనడంతోనే ఉన్మాదినయ్యా: రాంకుమార్

Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇటీవల నుంగంబాక్కం రైల్వే స్టేషనులో జరిగిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్ పోలీసులు విచారణలో హత్యకు సంబంధించిన మరిన్ని విషయాలను బయటపెటాడు. తాను మొదట స్వాతిని ఫేస్‌బుక్ ద్వారానే చూసినట్లు వెల్లడించాడు. అప్పట్నుంచి ఆమె కోసం తపించిపోయినట్లు చెప్పాడు.

అందుకే తాను తిరునెల్వేలి నుంచి చెన్నై నగరానికి వచ్చినటట్లు రామ్‌కుమార్‌ వెల్లడించాడు. అంతేగాక, స్వాతి ఇంటికి సమీపంలోని మాన్షన్‌లో నివాసం ఉన్నానని తెలిపాడు. ఉద్యోగ అన్వేషణ కోసం చెన్నై వచ్చినట్లు రామ్‌కుమార్‌ తల్లిదండ్రులు, పోలీసులు చెబుతున్నప్పటికీ.... స్వాతి కోసమే ఇక్కడకు చేరుకున్నట్లు రామ్‌కుమార్ చెప్పిన వివరాలను బట్టి చూస్తే తెలుస్తోంది.

కాగా, ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలపై రామ్‌కుమార్‌ ఎక్కువ ఆసక్తి చూపించేవాడని సమాచారం. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌లో స్వాతి ఖాతా కనిపించిందని నిందితుడు వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలిసింది. ఆమెను చూసి ఆకర్షితుడైన అతడు ఫేస్‌బుక్‌లో స్వాతి అప్‌డేట్లకు లైక్‌లు ఇచ్చి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడని తేలింది. స్వాతి కోసమే ఉద్యోగాన్వేషణ పేరిట చెన్నైకు వచ్చి ఆమె నివాసానికి సమీపంలోని మాన్షన్‌లో గది అద్దెకు తీసుకున్నాడని సమాచారం.

మాన్షన్‌కు సమీపంలోని ఆలయానికి వచ్చిన స్వాతిని తొలిసారి నేరుగా చూసి మరింత ఆకర్షణకు లోనయ్యాడని తెలిసింది. ఫేస్‌బుక్‌లోని పరిచయంతో ఆమెతో మాట్లాడి తాను ఐటీ ఉద్యోగినని చెప్పినట్లు సమాచారం.

టెక్కీ హత్యలో ట్విస్ట్: నిందితుడితో స్వాతికి ఫ్రెండ్‌షిప్! పక్కా ప్లాన్..

నిత్యం స్వాతిని అనుసరించడం, ఆమె గురించి తెలుసుకోవడమే పనిగా పెట్టుకున్నాడని తెలిసింది. ప్రేమ ప్రతిపాదన తీసుకురావడంతో ఆమె సున్నితంగా తిరస్కరించిందని, అనంతరం అతడితో మాట్లాడటం మానేసిందని, అప్పటికీ రామ్‌కుమార్‌ ఆమెను వెంబడించేవాడని సమాచారం.

ఒకానొక దశలో తన తండ్రికి చెప్పేస్తానని స్వాతి హెచ్చరించింది కూడా. అదే జరిగితే ఆమె కన్నవారి నుంచి మందలింపులు వచ్చేవని... అలా రాకపోవడంతో తనను స్వాతి ప్రేమిస్తున్నట్లు రామ్‌కుమార్‌ అపోహపడ్డాడని తెలిసింది. హత్య జరగడానికి కొద్ది రోజుల క్రితం కూడా ఆమె ముందు ప్రేమ ప్రతిపాదన పెట్టాడని తెలిసింది. వెంటపడి వేధింపులకు గురిచేసినట్లు సమాచారం.

Swathi murder suspect shifted to Chennai

కొండముచ్చు అని తిట్టడంతోనే హత్య చేశాడా?

ఈ నేపథ్యంలో రామ్‌కుమార్‌పై కోపాన్ని ప్రదర్శించడంతోపాటు తిట్టిందని, దీన్ని మనసులో పెట్టుకుని ఆమెను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు రామ్‌కుమార్‌ వాంగ్మూలం ఇచ్చాడని సమాచారం. తన ప్రేమ తిరస్కరించడంతోపాటు కొండముచ్చు(దేవాంగు)వలే ఉన్నావని తనను పదే పదే హేళన చేయడంతో తాను ఉన్మాదిలా మారిపోయి స్వాతిని హత్య చేసినట్లు దేవరాజన్ నేతృత్వంలోని విచారణ బృందం ఎదుట రామ్ కుమార్ వాంగ్మూలం ఇచ్చాడు.

హత్య అనంతరం ఇంటికి వెళ్లినా.. తల్లిదండ్రులకు దూరంగానే

రామ్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు... అతడు ఉన్న మేకలదొడ్డిలోని గదిలో కొన్ని ఖాళీ మద్యం సీసాలను గుర్తించారు. స్వాతి హత్య తర్వాత సొంతూరుకు తిరిగొచ్చిన అతడు నేరభావంతో తల్లిదండ్రుల మధ్య ఉండలేక ఇంటి ప్రాంగణంలోని మేకల దొడ్డికి మకాం మార్చుకున్నాడని భావిస్తున్నారు. రాత్రి సమయాల్లో అక్కడే మద్యం తాగి పడుకునేవాడని తెలిసింది.

తనలోని మార్పు కుటుంబసభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడటం కోసమే అతడు వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాడని సమాచారం. తొలి రెండు రోజులు మినహా మిగతా రోజులు మేకలను మేపడానికి వెళ్లడానికీ ఇదే కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు.

కాగా, గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు రామ్‌కుమార్‌ను పాళయం కొట్టై ఆస్పత్రి నుంచి చెన్నైకి తరలించారు పోలీసులు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం 5గంటల సమయంలో తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Less than 48 hours after his detention, P. Ramkumar, the suspected killer of Infosys software engineer S. Swathi, who was admitted to the Tirunelveli Government Medical College Hospital in the wee hours of Saturday after he slit his throat in a bid to commit suicide, was on Sunday evening taken by an EMRI 108 ambulance to Chennai amidst tight security.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి