ఆర్డర్ తయారీలో జాప్యం ; రెస్టారెంట్ యజమానిని చంపిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్ : ఢిల్లీలో దారుణం
ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్విగ్గి డెలివరీ బాయ్ ఓ రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆన్‌లైన్ ఫుడ్ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీకి చెందిన డెలివరీ ఏజెంట్ ఆర్డర్ సిద్ధం చేయడంలో ఆలస్యం కావడంతో ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఒక రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపారు. ఈ ఘటన రెస్టారెంట్ లో ఉన్న వారిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. రెస్టారెంట్ ఓనర్ ను హతమార్చిన డెలివరీ బాయ్ పరారయ్యాడు .డెలివరీ ఏజెంట్‌ని గుర్తించడానికి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

స్విగ్గీ ఆర్డర్ తయారీలో జాప్యం చేశారని రెస్టారెంట్ సిబ్బందితో స్విగ్గీ డెలివరీ ఏజెంట్ గొడవ
గ్రేటర్ నోయిడాలోని మిత్ర రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో సునీల్ అగర్వాల్ అనే వ్యక్తి ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. మంగళవారం సాయంత్రం స్విగ్గీ ఏజెంట్ చికెన్ బిర్యానీ మరియు పూరీ సబ్జీ ఆర్డర్ సేకరించడానికి రెస్టారెంట్‌కు వచ్చాడు. బిర్యానీ సమయానికి సిద్ధం చేసిన రెస్టారెంట్, పూరీ సబ్జీ చేయడానికి ఆర్డర్‌కు మరికొంత సమయం పడుతుందని స్విగ్గీ డెలివరీ ఏజెంటుకు చెప్పాడు. అయితే ఆర్డర్ సమయానికి ఇవ్వాలని అసహనం వ్యక్తం చేసిన స్విగ్గి ఏజెంట్ రెస్టారెంట్ లో పనిచేసే సిబ్బందితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా పెద్దదయ్యింది. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్ రెస్టారెంట్ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించాడు.

రెస్టారెంట్ యజమానిపై దాడి చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్
ఈ సమయంలో రెస్టారెంట్ యజమాని సునీల్ అగర్వాల్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. వారిద్దరి మధ్య గొడవ సద్దుమణిగేలా చేయాలని ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డెలివరీ ఏజెంట్ అతని స్నేహితుడి సహాయంతో రెస్టారెంట్ యజమాని తలపై బలంగా కొట్టాడు. దీంతో సునీల్ అగర్వాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రెస్టారెంట్ ఉద్యోగి మరియు ఇతర సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతను మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆస్పత్రికి తీసుకెళ్ళే లోపే రెస్టారెంట్ యజమాని మృతి
ఇక ఈ ఘటనకు సంబంధించి రెస్టారెంట్ సమీపంలోని వారు రెస్టారెంట్ సిబ్బంది, తమ యజమానిపై స్విగ్గి డెలివరీ బాయ్ దాడి చేశారని తమను పిలిచారని చెప్పారు. దాడిలో కిందపడిపోయిన రెస్టారెంట్ యజమానిని 100 కి డయల్ చేసి అంబులెన్స్ కోసం ఎదురు చూశామని కానీ అంబులెన్స్ త్వరగా రాకపోవడంతో మా వాహనంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లామని వెల్లడించారు. అయినప్పటికీ అప్పటికే రెస్టారెంట్ ఓనర్ మరణించారని తెలిపారు.
Recommended Video

క్షణికావేశంలో హంతకుడిగా మారిన స్విగ్గీ డెలివరీ బాయ్ .. రెస్టారెంట్ ఓనర్ మృతితో ఫ్యామిలీకి షాక్
కేవలం స్విగ్గి ఆర్డర్ డెలివరీ బాయ్ ఆర్డర్ సిద్ధం చేయడంలో ఆలస్యం అవుతుందన్న కారణంగా, ఆగ్రహంతో రెస్టారెంట్ ఓనర్ పై దాడి చేసి యజమానిని హతమార్చాడని పోలీసు అధికారి విశాల్ పాండే చెప్పారు. నిందితుడిని పట్టుకోవడానికి మూడు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టామని పోలీసులు చెప్తున్నారు.
ఊహించని విధంగా స్విగ్గి డెలివరీ బాయ్ చేతిలో దారుణ హత్యకు గురైన రెస్టారెంట్ ఓనర్ కుటుంబం ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ తింది. ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో రెస్టారెంట్ యజమానిపై దాడి చేసిన స్విగ్గి డెలివరీ బాయ్ హంతకుడిగా మారాడు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించిన్ ,మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న దానిపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications