Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూమ్ ఇండియా: ఇలాంటి వారికోసమే ఈ టాలెంట్ హంట్, జాబ్ ఫెయిర్

జాతీయ స్థాయి టాలెంట్ హంట్ - జూమ్ ఇండియా కార్యక్రమానికి ఒడిషా ప్రభుత్వం నేతృత్వంలోని ఎస్ఎస్ఈపీడీ శాఖ, కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఎమ్‌ఎస్‌జేఈలు సహకరిస్తున్నాయి. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని భువనేశ్వర్‌లోని శాంతిధమ్ ఫౌండేషన్ సమర్పిస్తోంది. ఇది జాతీయ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగి ఉంది. భారత దేశంలో దాదాపు 315 సంస్థలతో శాంతిధమ్ ఫౌండేషన్ జతకట్టింది.

కార్యక్రమంలోని హైలైట్స్

* ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన నైపుణ్యత కలిగిన చిన్నారులు అధికసంఖ్యలో పాల్గొంటారు.

Talent Hunt and Job Fair to empower underprivileged children to be held in Bhubaneswar

* టాలెంట్ ప్రదర్శించిన విజేతలకు, రన్నర్‌అప్‌గా నిలిచిన వారికి ముఖ్య అతిథి సత్కరిస్తారు.

* శాంతిధమ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ జాబ్ ఫెయిర్‌ నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారుల నైపుణ్యంను గుర్తించేందుకు మంచి వేదికగా నిలుస్తుంది

* జాతీయ స్థాయి పత్రిక "సమర్థ్"‌లో వీరి స్ఫూర్తిదాయక కథనాలను ప్రచురించి దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది

* ఈ కార్యక్రమంలో చిన్నారులు డ్యాన్స్, పాటలు, స్పీడ్ పెయింటింగ్, నటన మరియు మిమిక్రీలలో తమ ప్రతిభను, నైపుణ్యతను చాటుతారు

Talent Hunt and Job Fair to empower underprivileged children to be held in Bhubaneswar

* మొత్తంగా సమాజంలో దివ్యాంగులు వేరుకాదని వారు కూడా ఇందులో భాగమే అని చెప్పేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం. అందుకే జూమ్ ఇండియా పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులను ప్రోత్సహించడం జరుగుతుంది

* విజేతల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం 8 నవంబర్ 2019న సాయంత్రం 6 గంటలకు భువనేశ్వర్‌లోని రైల్వే ఆడిటోరియంలో జరుగుతుంది.

నిరుపేద కుటుంబం నుంచి వచ్చే చిన్నారుల్లోని టాలెంట్‌ను వెలికి తీసి ప్రపంచానికి చాటేందుకు జూమ్ ఇండియా నడుం బిగించిందని ప్రోగ్రాం కోఆర్డినేటర్ తెలిపారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారని తెలిపారు. పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు, బోధనా సిబ్బంది, స్టాఫ్ మెంబర్స్ కూడా హాజరుకానున్నట్లు చెప్పారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్, చిన్న స్థాయి పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నట్లు కోఆర్డినేటర్ వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+