కర్ణాటకలో చిచ్చు రేపిన తమిళ హీరో అజిత్: 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి!
బెంగళూరు: తమిళంలో ఘనవిజయం సాధించిన'ఎన్నై అరిందాల్'సినిమాను సత్యదేవ్ ఐపీఎస్ పేరుతో కన్నడలోకి డబ్బింగ్ చేసి 90 థియేటర్లకు పైగా విడుదల చెయ్యడంతో కర్ణాటకలో కన్నడ సంఘలు మండిపడ్డాయి. వెంటనే సినిమా ప్రదర్శన నిలిపివేయకపోతే థియేటర్లకు నిప్పంటిస్తామని హెచ్చరించారు.
అజిత్, అనుష్క, త్రిషా జంటగా గౌతమ్ వాసుదేవ్ మెనన్ దర్శకత్వంలో నటించిన సినిమాను సత్యదేవ్ ఐపీఎస్ పేరుతో కన్నడలోకి డబ్బింగ్ చేశారు. మార్చి 3వ తేది శుక్రవారం కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో సినిమా విడుదల చేశారు. అయితే కర్ణాటకలో పలు జిల్లాల్లో సినిమా విడుదల కాకుండా కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి.

థియేటర్ కు నిప్పంటిస్తాం: హీరో జగ్గేష్
బెంగళూరులో ఒక్క థియేటర్ లో కూడా సత్యదేవ్ ఐపీఎస్ సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారు. కన్నడ హీరో, బీజేపీ ఎమ్మెల్సీ జగ్గేష్ సత్యదేవ్ ఐపీఎస్ సినిమాను బెంగళూరులో విడుదల చేస్తే థియేటర్లకు నిప్పటిస్తామని హెచ్చరించారు. హీరో జగ్గేష్ కు పలు కన్నడ సంఘాలు మద్దతు ఇవ్వడంతో బెంగళూరులో ఒక్క థియేటర్ లో కూడా సినిమా విడుదల కాలేదు.

హడలిపోయిన ప్రేక్షకులు
దావణగెరెలోని మోతీ చిత్రమందిరంలో సత్యేదేవ్ ఐపీఎస్ సినిమా శుక్రవారం విడుదల అయ్యింది. అయితే ఉదయం ఆట ప్రారంభం కావాల్సిన సమయం 10.30 గంటలు దాటిన తరువాత కూడా ఒక్క ప్రేక్షకుడు థియేటర్ లో అడుగు పెట్టకపోవడంతో ప్రదర్శన రద్దు చేస్తూ థియేటర్ ను మూసివేశారు. ఎక్కడ గొడవలు జరుగుతామో అంటూ సినీ అభిమానులు ఆందోళన చెందారు. థియేటర్ దగ్గర 20 మందికి పైగా పోలీసులు భద్రత కల్పించినా సినీ అభిమానులు మాత్రం అటు వైపు కన్నెత్తికూడా చూడలేదు.

40 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తమిళ హీరో అజిత్
గత 40 ఏళ్ల క్రితం కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలు విడుదల చెయ్యరాదని తీర్మానించారు. 40 ఏళ్ల నుంచి డబ్బింగ్ సినిమాలను నిషేధించారు. అయితే అజిత్ నటించిన తమిళ సినిమాను కన్నడలోకి డబ్బింగ్ చేసి కర్ణాటకలో విడుదల చెయ్యడంతో ఆ చరిత్రను అజిత్ తిరగరాశారు.

మార్చి 3వ తేది కన్నడ చలనచిత్ర దినోత్సవం
కన్నడ చిత్రసీమ మార్చి 3వ తేది జీవితాంతం గుర్తు పెట్టుకునే రోజు. మార్చి 3వ తేది కన్నడ చలనచిత్ర దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తారు. 1934 మార్చి 3వ తేది వై.వీ. రావు దర్శకత్వం వహించిన మొట్టమొదటి కన్నడ టాకీ సినిమా సతి సులోచన విడుదల అయ్యింది. అయితే అదే మార్చి 3వ తేది తమిళ సినిమాను కన్నడలోకి డబ్బింగ్ చేసి సినిమాను విడుదల చేశారు.

కన్నడ
కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ డబ్బింగ్ సినిమాలను వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేశారని, ఇప్పుడు ఆయన వారసుడు హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చెయ్యాలని, కిచ్చ సుదీప్ ఎక్కడో కుర్చుని తాను డబ్బింగ్ సినిమాల విడుదలకు వ్యతిరేకం అంటూ స్టేట్ మెంట్ ఇస్తే సరిపోదని అందరూ వచ్చి పోరాటం చెయ్యాలని కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. డబ్బింగ్ సినిమాల విడుదలను మొదట్లోనే అడ్డుకోకుంటే కన్నడ సినీపరిశ్రమ అంతం అవుతుందని కన్నడ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications