దారుణం: భర్త అందంగా లేడని, పెళ్లైన వారానికే చంపేసింది

కట్టుకున్న భర్త అందంగా లేడనే కారణంతో పెళ్లైన వారానికే భార్య అతడిని హత్య చేసింది. తమిళనాడులోని కడలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

చెన్నై: కట్టుకున్న భర్త అందంగా లేడనే కారణంతో పెళ్లైన వారానికే భార్య అతడిని హత్య చేసింది. తమిళనాడులోని కడలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరవై రెండేళ్ల యువతికి స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తితో వారం క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.

యువతి తరపు బంధువులు, స్నేహితులు ఆమె భర్త అందంగా లేడని, సరిజోడి కాదని హేళన చేశారు. దీంతో ఆ యువతి మనస్తాపానికి గురయింది. దీంతో గత రాత్రి సదరు యువతి భర్తతో వాగ్వివాదానికి దిగింది. కోపంతో ఊగిపోయిన ఆమె భర్త తలపై గ్రైండర్‌ రాయితో కొట్టి చంపేసింది.

murder

అనంతరం ఏమీ ఎరగనట్టు తన భర్తను ఎవరో చంపేశారని కథలు అల్లింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించే సరికి అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు యువతిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పరచగా ఆమెను రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+