రంగంలోకి వచ్చిన ఎంజీఆర్ దత్తపుత్రిక సుధ: ఏం జరుగుతోంది ?
చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్) దత్తపుత్రిక సుధ హఠాత్తుగా తెరపైకి రావడంతో అన్నాడీఎంకే వర్గాలకు కొత్త సంకేతాలు పంపుతున్నాయి.
చెన్నైలోని రామాపురంలోని ఎంజీఆర్ నివాస గృహంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని, అన్నాడీఎంకే పతాకాన్ని అవిష్కరించడానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ఎంజీఆర్ ఇంటికి వెళ్లారు.

అక్కడ ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే పతాకాన్ని, ఎంజీఆర్ విగ్రహాన్ని శశికళ ఆవిష్కరించారు. ఈ సందర్బంలో ఎంజీఆర్ దత్తపుత్రిక సుధ ఏమి మాట్లాడతారు ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా ఎంజీఆర్ దత్తపుత్రిక సుధ శశికళ గురించి ఏమి చెబుతారు ? అంటూ అన్నాడీఎంకే నాయకులు టెన్షన్ పడ్డారు.
ఈ సందర్బంగా ఎంజీఆర్ దత్తపుత్రిక సుధ మాట్లాడుతూ తాను మా నాన్న ఎంజీఆర్ విగ్రహావిష్కరణకు రావాలని శశికళను తానే ఆహ్వానించానని చెప్పడంతో శశికళ వర్గీయుల్లో ప్రశాంతత నెలకొంది. ఎంజీఆర్ అభిమానులను ఆకట్టుకోవడానికి మంగళవారం తమిళనాడులో ప్రభుత్వ సెలవు ప్రకటించారు.
అంతకు ముందు చెన్నైలోని మెరీనా బీచ్ లో ఎంజీఆర్ కు నివాళులు అర్పించడానికి శశికళ వెళ్లిన సమయంలో అక్కడ జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో దర్శనం ఇచ్చారు. దీపాకు మద్దతుగా నినాదాలు చెయ్యడంతో కంగుతిన్న శశికళ వర్గీయులు చిన్నమ్మకు మద్దతుగా నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications