గెస్ట్‌హౌస్‌లో దారుణాలు.. పొక్సో కేసులో సీఎం విజయ్ సీరియస్!

తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న మైనర్ బాలికల లైంగిక వేధింపుల కేసులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. 84 ఏళ్ల ప్రముఖ వ్యాపారవేత్త చిక్కుకున్న ఈ భయంకరమైన పొక్సో కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని, ఎలాంటి ప్రభావవంతమైన వ్యక్తులైనా, ఎంతటి అండదండలు ఉన్నా వదిలిపెట్టేదే లేదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరింత మంది మైనర్ బాలికలు బాధితులుగా తేలడం, వారి విచారణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ముఖ్యమంత్రి స్వయంగా పోలీసు ఉన్నతాధికారులను పిలిపించి సమీక్ష నిర్వహించారు.

వాస్తవానికి ఈ కేసు ఆరంభంలో పోలీసు యంత్రాంగం కేసును మూసివేసేందుకు ప్రయత్నించడం గమనార్హం. వ్యాపారి గెస్ట్‌హౌస్‌లో ఒక చిన్నారిపై వేధింపులకు సంబంధించిన దృశ్యాలున్న పెన్‌డ్రైవ్ (USB) ఆధారంగా కేసు నమోదు కాగా, ఆ వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తించలేకపోతున్నామని చెన్నై పోలీసులు కేసు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, దీనిని కోర్టు తీవ్రంగా తిరస్కరించింది. పునఃపరిశీలనకు ఆదేశించడంతో విచారణ మళ్లీ మొదటికొచ్చింది. ఆపై ఏసీపీ రాజలక్ష్మి నాయకత్వంలో ప్రత్యేక బృందం విచారణ జరిపి, 2019లోనే ఆ బాలికపై అరాచకం జరిగిందని నిర్ధారించడంతో ఆగస్టు 29న సదరు వయోవృద్ధుడైన వ్యాపారితో పాటు మరో ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేశారు.

Tamil Nadu CM Vijay Orders Strict Probe in High Profile POCSO Case Involving 84 Year Old Businessman
బడి పిల్లలకు చికెన్ బిర్యానీ, సీఎం విజయ్ మార్క్ సంచలన నిర్ణయం!
బడి పిల్లలకు చికెన్ బిర్యానీ, సీఎం విజయ్ మార్క్ సంచలన నిర్ణయం!

తోడుగా ఎస్సీ/ఎస్టీ చట్టం.. మరింత మంది బాధితులు లభ్యం!

ఈ దర్యాప్తు పురోగతి సాధిస్తున్న కొద్దీ ఈ దారుణాల తీవ్రత బయటపడుతోంది. బాధితుల్లో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందిన బాలికగా తేలడంతో పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా సెక్షన్లు చేర్చారు. ప్రధాన ఫిర్యాదుదారుతో పాటు మరో ఏడుగురు మైనర్ బాలికలను కూడా ఈ వ్యాపారి వేధించినట్లు చెన్నై పోలీసు విచారణలో రుజువైంది. ఆ బాలికల వాంగ్మూలాలను మద్రాస్ హైకోర్టులోని పొక్సో ప్రత్యేక కోర్టు నమోదు చేసింది. తాజాగా మరో తొమ్మిది మంది చిన్నారులు కూడా తమపై జరిగిన అక్రమాలను వెల్లడించినట్లు సమాచారం రావడంతో ఈ కేసులో వేధింపులకు గురైన వారి సంఖ్య మరింత పెరిగింది.

విజయ్ వన్ మ్యాన్ షో- పాలనను మించి కల్ట్ పాలిటిక్స్- 4 నెలల్లో జరిగిందేంటి ?
విజయ్ వన్ మ్యాన్ షో- పాలనను మించి కల్ట్ పాలిటిక్స్- 4 నెలల్లో జరిగిందేంటి ?

జైలులోనే విచారణ.. ప్రత్యేక మహిళా అధికారుల బృందం రంగంలోకి

నిందితుడి వయసు 84 ఏళ్లు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, పొక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పద్మ షణ్ముగసుందరం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించారు. పుళల్ కేంద్ర కారాగారంలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నిఘా విభాగం అధికారులు వీడియోగ్రాఫీ మధ్య అతడిని ప్రశ్నిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న ఇతర బాలికలను, వారితో సంబంధం ఉన్న ముఠాను పట్టుకోవడానికి సబ్-ఇన్‌స్పెక్టర్ల స్థాయి మహిళా అధికారులతో ప్రత్యేక టీమ్ ఏర్పడింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ కేసుకు సంబంధించిన ఎవరినీ విడిచిపెట్టవద్దని సీఎం ఆదేశించడంతో తమిళనాడు పోలీస్ యంత్రాంగం ఉరుకులు పరుగులు తీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+