బెంగళూరులో పక్క రాష్ట్రం పార్టీ అభ్యర్థి పోటీ, మాజీ సీఎం క్లారిటీ, ఎక్కడంటే, ఢీ అంటే ఢీ !
బెంగళూరు/చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇప్పుడు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ, ఎన్సీపీ, ఆప్ పార్టీలో రంగంలోకి దిగాయి. ఇప్పుడు పక్క రాష్ట్రంలోని ఓ ప్రధాన పార్టీ నుంచి బెంగళూరులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది.
ఏఐఏడీఎంకే పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎంజీఆర్, జయలలిత పేర్లు మాత్రమే. జయలలిత చేతికి ఏఐఏడీఎంకే (ఏడీఎంకే) పార్టీ పగ్గాలు వచ్చిన తరువాత తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. జయలలిత అనారోగ్యంతో చనిపోయిన తరువాత ఏఐడీఎంకే పార్టీ ముక్కలు అయ్యింది. ఇప్పుడు ఏఐఏడీఎంకే పార్టీలో ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం గ్రూపులు రెండుగా చీలిపోయాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏడీఎంకే పార్టీ నుంచి పోటీ చెయ్యాలని చాలాకాలం నుంచి చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కొన్ని నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపాలని మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అనేక ప్రయత్నాలు చేశారు. ఇద్దరూ నాయకులు బీజేపీ నేతలతో చర్చలు జరిపినా ఆ చర్చలు ఏమాత్రం ఫలించలేదు.

ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి వర్గం నుంచి బెంగళూరు నగరంలోని పులకేశీనగర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో డి. అన్బరసన్ పోటీ చేస్తున్నారు. బెంగళూరులోని పులకేశీనగర్ నుంచి తమ పార్టీ అభ్యర్థి డి. అన్బరసన్ పొటీ చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి బుధవారం చెన్నైలో అధికారికంగా వెళ్లడించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకే పార్టీ అభ్యర్థులను పోటీ చేయించాలని చాలా రోజుల నుంచి ఎడప్పాడి పళనిస్వామి ఆ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. చెన్నైలో పార్టీ పదాధికారులతో చర్చలు జరిపిన మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి బెంగళూరు సిటీలోని పులకేశీనగర్ లో తమ పార్టీ అభ్యర్థిగా అన్బరసన్ ను పోటీలో దింపాలని నిర్ణయించారు.
బెంగళూరు నగరంలో చాలా మంది తమిళ సోదరులు నివాసం ఉంటున్నారు. పులకేశీనగర్ పరిధిలోని ప్రేజర్ టౌన్ లో తమిళ ఓటర్లు వేల సంఖ్యలో ఉన్నారు. అందుకే పులకేశీనగర్ లో మాత్రమే ఏఐఏడీఎంకే పార్టీ నుంచి ఎడప్పాడి పళనిస్వామి వర్గంలోని డి, అన్బరసన్ పోటీ చేస్తారని తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు.












Click it and Unblock the Notifications