తమిళనాడు గవర్నర్ వీడియో వైరల్.. ఈ వయసు లోనా !
తమిళనాడు గవర్నర్ డా. రవీంద్ర నారాయణ హాట్ టాపిక్ గా మారారు. 73 ఏళ్ల వయసులో ఆయన అసలు ఎలా ఈ పని చేశారంటూ జోరుగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ షాకింగ్ ఘటనకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ రవీంద్ర నారాయణ రవి 51 పుషప్స్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మధురైలోని వెలమ్మాల్ విద్యా సంస్థలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ ఆర్ఎన్ రవి, తన ఫిట్‌నెస్‌తో అందరికీ షాక్ ఇచ్చారు. ఏమాత్రం అలసట లేకుండా వరుసగా 51 పుషప్స్ పూర్తి చేశారు. ఆయన పుషప్స్ చేస్తుండగా.. అక్కడున్నవారంతా చప్పట్లతో అభినందించారు.

డా. రవి 1976 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, కేరళ కేడర్‌లో తన సర్వీసు ప్రారంభించారు. ఫిజిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన అనంతరం, సివిల్స్‌లో ర్యాంకు సాధించి పోలీసు సేవలోకి వచ్చారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శాంతి రాయబారిగా కూడా పనిచేశారు. 2021లో తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు గవర్నర్ ఫిట్‌నెస్‌ను అభినందిస్తున్నారు. 73 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉన్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
70 வயதில்.. 51 தண்டால்..அசத்திய ஆளுநர் ஆர்.என்.ரவி | Tamil Janam |#governorravi #governor #tamiljanam #rnravi #yogaday #Yoga pic.twitter.com/d2YcvofJcr
— Tamil Janam (@TamilJanamNews) June 21, 2025












Click it and Unblock the Notifications