ఇది సార్ మా సీఎం బ్రాండ్: రూపాయి అవుట్

Rupee symbol: దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోన్న అంశం- డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.

ఫలితంగా అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాజకీయంగా ఎంతగానో లబ్దిపొందుతాయనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అందుకే ఎక్కువమంది పిల్లలను కనాలంటూ విజ్ఞప్తి చేస్తూ వస్తోన్నారాయన కొంతకాలంగా.

ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Rupee

ఇదే కాకుండా త్రిభాషా అమలును కూడా గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు స్టాలిన్. హిందీని బలవంతంగా రుద్దు తున్నారంటూ మండిపడుతున్నారు. త్రిభాషా ఫార్ములాను అమలు చేయని రాష్ట్రాలకు సర్వ శిక్షా అభియాన్ కింద మంజూరు చేయాల్సిన నిధులను నిలిపివేస్తామంటూ కేంద్రం హెచ్చరించడాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హిందీ అక్షరాలను చెరిపేస్తోన్నారు డీఎంకే నాయకులు.

ఈ పోరును మరింత ఉధృతం చేసింది తమిళనాడు ప్రభుత్వం. దేశం మొత్తం ఉపయోగిస్తోన్న రూపాయి సింబల్‌ ₹ను మార్చివేసింది. దాని స్థానంలో తమిళ అక్షరాన్ని చేర్చింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-2026 బడ్జెట్ ప్రతిపాదనల్లో రూపాయి సింబల్‌ను తొలగించింది. తమిళ అక్షరాన్ని జోడించింది.

గత బడ్జెట్ అంటే 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌లో రూపాయి సింబల్ ఉండేది. ఈ సింబల్ అమలులోకి వచ్చినప్పటి నుంచీ దాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. త్రిభాషా, డీలిమిటేషన్ ఉద్యమాలను తెరమీదకి తీసుకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి సింబల్‌ను డ్రాప్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+